కశ్మీర్ పై ప్రధాని ప్రసంగం.. టాలీవుడ్ కు మోడీ ఆహ్వానం!

By tirumala ANFirst Published Aug 8, 2019, 8:56 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితమే కాశ్మీర్ అంశంపై జాతినుద్దేశించి ప్రసంగించారు. కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ లో కూడా బిల్లు పాస్ కావడంతో కశ్మీర్ లో సరికొత్త అధ్యాయం మొదలైంది. 

ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితమే కశ్మీర్ అంశంపై జాతినుద్దేశించి ప్రసంగించారు. కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ లో కూడా బిల్లు పాస్ కావడంతో కశ్మీర్ లో సరికొత్త అధ్యాయం మొదలైంది. 

పూర్తిస్థాయిలో కశ్మీర్  ఇండియాలో అంతర్భాగం అయింది. ఇకపై కశ్మీర్, లడక్ ప్రాంతాల పూర్తి అధికారం కేంద్రం చేతుల్లో ఉండనుంది. ఈ విషయం గురించి మోడీ ప్రసంగిస్తూ.. ఇకపై కశ్మీర్ ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం అని తెలిపారు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ప్రస్తావన తీసుకువచ్చారు. 

తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల గురించి మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధాన చిత్ర పరిశ్రమలైన ఈ మూడు ఇకపై కశ్మీర్ కు షూటింగ్స్ కోసం రావాలని మోడీ కోరారు.  కశ్మీర్ ప్రకృతి అందాలు పర్యాటకులని సైతం ఆకర్షిస్తాయి. కానీ అక్కడ ఉగ్రవాదం, ఇతర ఉద్రిక్త పరిస్థితుల వల్ల పర్యాటక రంగం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. కశ్మీర్ లో నవశకం ప్రారంభమైన నేపథ్యంలో ఇకపై పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.  

click me!