
పాన్ ఇండియా రేంజ్ లో సౌత్ సినిమా సత్తా చాటుతున్నసంగతి తెలిసిందే.. ఇందులో భాగంగా.. టాలీవుడ్ తో పాటు..కన్నడ సినీమాలు కూడా ఓవర్ ఆల్ ఇండియా రేంజ్ లో .. కలెక్షన్ల పరంగా సత్తా చాటుకుంటుంది కన్నడ సినిమా. కెజియఫ్, కాంతారా లాంటి సినిమాలు ప్రపంచ వ్యాప్తం గుర్తింపు పొందాయి. ఈక్రమంలో కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులను ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి విందును ఇచ్చారు. కర్ణాటకలో ఐదు రోజుల పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ అందులో భాగంగా.. రకరకాల రంగాల వారితో భేటీ అవుతూ వస్తున్నారు.
ఈక్రమంలోనే ప్రధాని నరేంద్ర మోది... రాజ్ భవన్‌లో ఏరో ఇండియా పోగ్రామ్‌ని ప్రారంభించారు. అనంతరం కొంత మంది సెలబ్రీటీలకు రాజ్ భవన్‌లో విందు ఇచ్చారు. ఈ విందులో సినిమా, క్రీడారంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.ఇక బెంగళూరులో జరిగిన ఈకార్యక్రమంలో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కెజియఫ్ నిర్మాత.. హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరంగదూర్, యంగ్ స్టార్ హీరో యష్ , కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి , దివంగత పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వినీ తో పాటు శ్రద్ధ్రా జైన్ తదితరులను ప్రధాని మోదీ కలుసుకున్నారు.
ఈసందర్భంగా వారు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలు అంశాలపై చర్చించారు. అంతే కాదు కెజియఫ్ సినిమాతో యష్.. కాంతారా సినిమాతో రిషబ్ శెట్టి సాధించిన విజయాలకు వారిని ప్రధాని అభినందించారు. ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాదు పునిత్ రాజ్ కుమార్ ఫ్యామిలీతో కూడా ఆయన మాట్లాడి ధైర్యం చెప్పారు. ఇందుకు సబంధించిన ఫోటోలను కాంతారా హీరో రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా పేజ్ లో ఫ్యాన్స్ కు శేర్ చేశారు.
ఈఫోటోలతో పాటు నోట్ కూడా రాశారు రిషబ్. ప్రధాని మోదీని కలుసుకోవడం ఆనందంగా.. అద్భుతంగా ఉంది. ఇండియా తో పాటు కర్ణాటక రాష్ట్ర డెవలప్ మెంట్ తో సినిమా ఇండస్ట్రీ పాత్రపై మేం చర్చించాం. మీ లీడర్‌షిప్‌లో బెటర్ ఇండియాను నిర్మించడానికి మా వంతు సహాయాన్ని అందించడం గర్వంగా ఉంది అని రిషబ్ పేర్కొన్నారు. ఈసందర్భంగా ఈ పోస్ట్ సోసల్ మీదియాలో వైరల్అవుతోంది.
శాండల్ వుడ్ నుంచి వరుస సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్నాయి. లాస్ట్ ఇయర్ కెజియఫ్, కాంతార సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం నమోదు చేశాయి. భారీ స్థాయి వసూళ్లను రాబట్టాయి. ఈ రెండు సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. అటు కెజియఫ్ రెండు సినిమాలు రిలీజ్ అవ్వగా..మూడ్ భాగం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కాంతారా సినిమాకు కూడా ప్రీక్వెల్ తెరకెక్కించే దిశగా అడుగులు వేస్తున్నాడు రిషబ్.