‘సలార్’ కి ప్రశాంత్ నీల్ కు దిమ్మతిరిగే రెమ్యునరేషన్ ... ఎంతంటే...?

By Surya Prakash  |  First Published Oct 14, 2023, 8:29 AM IST

  ‘సలార్’   విడుదలకు ముందే తెలుగు నిర్మాతల కోసం రెండు భారీ ప్రాజెక్టులకు సైన్ చేశాడు. ఈ నేఫధ్యంలో సలార్ చిత్రం కోసం ప్రశాంత్ నీల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. 



ఇండియన్ భాక్సాఫీస్ దగ్గర దర్శకుడు ప్రశాంత్ నీల్ సరికొత్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. యష్ హీరోగా ఆయన తెరకెక్కించిన 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' చిత్రాలు బాక్సాఫీస్ దుమ్ము దులిపాయి. 'కేజీఎఫ్ 2' ఇప్పటికే రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఒక్క హిందీలోనే రూ. 321 కోట్లను కొల్లగొట్టింది. అంతకు ముందు పెద్దగా పట్టించుకోని  కన్నడ చిత్రసీమను తన సినిమాల ద్వారా ప్రశాంత్ నీల్ ఒక రేంజ్ కు తీసుకెళ్లాడు.  2014లో తన తొలి సినిమా 'ఉగ్రమ్' నుంచి ఓ డిఫరెంట్ స్టైల్ యాక్షన్ ని తెరపైకి తెస్తున్నారు. ఏ మాత్రం అంచనాలు లేని ఉగ్రం సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 'సలార్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  సినిమా విడుదలకు ముందే తెలుగు నిర్మాతల కోసం రెండు భారీ ప్రాజెక్టులకు సైన్ చేశాడు. ఈ నేఫధ్యంలో సలార్ చిత్రం కోసం ప్రశాంత్ నీల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. 

మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ...  రిలీజ్ కు రెడీగా  ఉన్న ప్రభాస్ నటించిన ‘సాలార్’ చిత్రానికి రూ.25 కోట్లు చెల్లించారు. అలాగే లాభాల్లో వాటా కూడా తీసుకుంటారు. ‘కేజీఎఫ్‌’కి చెందిన హోంబలే ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అంతకు ముందు కూడా ఈ సంస్ద రెమ్యునరేషన్ విషయంలో ఇదే తరహా ఎగ్రిమెంట్ చేసుకున్నారు. దాంతో ప్రశాంత్ నీల్ బాగా లాభపడ్డారు. ఇక ఆ తర్వాత చేయబోయే చిత్రం కోసం మైత్రీ మూవీ మేకర్స్ వారు నీల్ #NTR31 కోసం అడ్వాన్స్ మొత్తాన్ని కూడా ఇచ్చారు. నిర్మాత డివివి దానయ్య కోసం మరో తెలుగు సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. పాన్-ఇండియా విజయం  సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ మరింత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు దానయ్య తమ సినిమాల కోసం లాభాల్లో వాటాతో పాటు  దాదాపు రూ.50 కోట్లు ప్రశాంత్ నీల్ కు ఇస్తున్నారంటున్నారు.  యష్ లాంటి స్టార్‌తో రూ. 1000 కోట్ల (గ్రాస్) సినిమాను ఇచ్చినందుకు ప్రశాంత్  ఆ మొత్తంకు అర్హుడు.

Latest Videos

ఇక పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్  తాజా చిత్రం సలార్  రిలీజ్ డేట్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సిన ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ డిసెంబర్ 22 వ తేదీకి ఫోస్ట్ ఫోన్ అయ్యింది. ఈ విషయం ప్రకటించిన దగ్గర నుంచి ఈ చిత్రం ప్రమోషన్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ దృష్టి మరలింది.   సలార్‌ ట్రైలర్ కోసం వాళ్లు వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. 

ఏదైమైనా ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారనటంలో సందేహం లేదు. ప్రభాస్ ఈ సినిమాపై బాగా నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ ఏడాది ఆదిపురుష్ తో  ప్రభాస్ పెద్ద డిజాస్టర్  అందుకోవడంతో అభిమానులందరూ.. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇంకా  ఈ చిత్రం నిమిత్తం కొన్ని రీ షూట్ లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అద్బుతమైన అవుట్ ఫుట్ తో కేజీఎఫ్ ని మించిన హిట్ ఇవ్వాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు సమాచారం. 
 

click me!