
నందమూరి తారకరామారావు ఆర్ట్స్ సంస్థ తరఫున కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ డేట్ తో పాటుగా టైమింగ్ కూడా ప్రకటించారు. మే 19న మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ‘జై లవ కుశ’ ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నారు.
ఎన్టీఆర్ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేయబోతుండగా అందులో ఒకటి నెగెటివ్ క్యారెక్టర్ అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విడుదల అవుతున్న ఈ ఫస్ట్ లుక్ లో జూనియర్ విలన్ లుక్ ను పరిచయం చేయరట. చివరి వరకు ఈ నెగిటివ్ లుక్ విషయంలో రహస్యాన్ని కొనసాగిస్తారు అని టాక్.
ఈసినిమాలో ఎన్టీఆర్ చేస్తున్న నార్మల్ క్యారెక్టర్ లుక్ తోనే ఈ ఫస్ట్ లుక్ ఉండబోతోంది అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి జూనియర్ నటిస్తున్న మూడు పాత్రలలో ఒక పాత్రలో బ్యాంకు ఉద్యోగిగా, మరో పాత్ర లో దొంగగా కనిపిస్తే మూడో పాత్ర పర్‌ఫెక్ట్ విలన్ అని అంటున్నారు.
ఈ మూవీ షూటింగ్ 50 శాతానికి పైనే పుత్యయిన నేపధ్యంలో ఈ మూవిని అనుకున్న విధంగా పూర్తిచేసి ‘జనతా గ్యారేజ్’ రిలీజైన తేదీనాడు సెప్టెంబరు 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.