జస్ట్‌ ఆస్కింగ్‌...బాలీవుడ్ ను టార్గెట్ చేసిన ప్రకాశ్ రాజ్, కౌంటర్లు, క్వశ్చన్లతో రెచ్చిపోతున్న స్టార్ యాక్టర్

Published : Jul 21, 2022, 11:21 AM ISTUpdated : Jul 21, 2022, 11:25 AM IST
జస్ట్‌ ఆస్కింగ్‌...బాలీవుడ్ ను టార్గెట్ చేసిన ప్రకాశ్ రాజ్, కౌంటర్లు, క్వశ్చన్లతో రెచ్చిపోతున్న స్టార్ యాక్టర్

సారాంశం

క్వశ్చన్లు , కౌంటర్లతో రెచ్చిపోతున్నాడు స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాశ్ రాజ్. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక ఈసారి బాలీవుడ్ ను టార్గెట్ చేశాడు ప్రకాశ్. ఒక్కొక్కరిని గట్టిగానే టార్గెట్ చేసినట్టున్నాడు. 

ఈ మధ్య ఎవ్వరినీ వదలిపెట్టడం లేదు స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాశ్ రాజ్. వరుసగా  వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో నిలుస్తున్నాడు. ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాష్ రాజ్... మా ఎలక్షన్స్ తో సంచలనంగా మారాడు. అంతే కాదు దేశంలో  ప్రస్తుత రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. ఇంకా చెప్పాలి అంటే అదిరిపోయేలా  సెటైర్స్ వేస్తున్నాడు. ముఖ్యంగా  మోడీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో  జస్ట్ ఆస్కింగ్ అంటూ వైరల్ పోస్ట్ లు  పెడుతూ.. హడావిడి చేస్తున్నాడు. 

అయితే ప్రస్తుతం ఓ విషయంలో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. గతంలో ప్రభుత్వంలో జరిగిన తప్పులు, ఇబ్బందులు, ఇతర  విషయాలపై స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు ప్రస్తుతం  ఉన్న ప్రభుత్వంపై  ఎటువంటి స్పందన లేకుండా. ఏం చేసినా అడగకుండా మౌనం వహించడంపై రకరకాలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాష్ రాజ్ వారిపై రీసెంట్ గా స్పందించారు. ఒక్కోక్కరిని నిలబెట్టి కడిగేసేలా ప్రశ్నలు సంధించారు. 

 

 

ప్రస్తుతం ప్రకాశ్ రాజ్  చేసిన ఓ ట్వీట్‌ చర్చనీయాంశమైంది. ఇందులో కశ్మీర్‌ ఫైల్స్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి, బాలీవుడ్‌ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్‌, శిల్పాశెట్టి, జూహీ చావ్లా, అనుపమ్‌ ఖేర్‌ ట్వీట్స్‌కు సంబంధి స్క్రీన్‌ షాట్స్‌ పెట్టడంలో అవి హాట్ టాపిక్ అయ్యాయి.  ఇందులో  బాలీవుడ్ స్టార్స్ ప్రభుత్వంపై సెటైర్లు వేసిన ట్వీట్స్ ఉన్నాయి. అందులో.. సంతోషం పెట్రోల్ ధరలా తరహాలో పెరగాలి.. బాధలు ఇండియన్ రూపీలాగా తగ్గాలి. హృదయం కరప్షన్ తరహాలో జాయ్‌తో నిండిపోవాలి... అంటూ వివేక్ అగ్నిహోత్రి గతంలో చేసిన ఈ ట్వీట్‌ అప్పుట్లో తీవ్ర రచ్చకు దారి తీసింది. ఇక శిల్పా శెట్టి డాలర్ రేటు పెరుగుతూ ఉండడం పై సెటైర్ వేసింది. 

అంతే కాదు బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ  అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్‌లతో పాటు నటి జూహి చావ్లా  కూడా అప్పట్లో రూపాయి విలువను లో దుస్తులతో పోల్చడం వివాదాస్పదంగా మారింది. అయితే ఈ ట్వీట్స్‌ ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే 2012 లో చేసినవి . ఈ ట్వీ‍ట్స్‌కు సంబందించిన స్క్రీన్‌ షాట్స్‌కు ప్రకాశ్‌ రాజ్‌  పోస్ట్ చేశారు. వీరందరికి  కప్పుడు దేశంలో అంటూ జస్ట్‌ ఆస్కింగ్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జత చేసి పోస్ట్‌ చేశాడు.  అప్పుటు అలా ప్రశ్నించిన స్టార్స్.. ఇప్పుడు అంతకంటే ధారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు స్పందించడంలేదు అంటూ మైండ్ బ్లాక్ అయ్యేలా పోస్ట్ చేశాడు. దీనిపై ఇప్పటి వరకూ ఏ స్టార్ స్పందించలేదు. నెటిజన్లు మాత్రం రకరకాలు గా కామెంట్లు పెడుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Janhvi Kapoor: బ్యాక్‌లెస్ డ్రెస్‌లో జాన్వీ ఆరాచకం.. చెవిపోగుల ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Ram Charan Review: డెకాయిట్‌ మూవీకి రామ్‌ చరణ్‌ రివ్యూ.. అంత బాగానే ఉంది, అసలు విషయం వదిలేశాడు