హీరోగా యాంకర్ ప్రదీప్!

Published : Mar 22, 2019, 12:43 PM IST
హీరోగా యాంకర్ ప్రదీప్!

సారాంశం

బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని షోలతో పాపులారిటీ బాగానే సంపాదించాడు.

బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని షోలతో పాపులారిటీ బాగానే సంపాదించాడు. '100% లవ్', 'అత్తారింటికి దారేది' వంటి సినిమాల్లో చిన్న పాత్రలు కూడా పోషించాడు.

ఇప్పుడు ఏకంగా హీరోగా వెండితెరకి పరిచయం కానున్నాడు. ఈ మధ్యకాలంలో చాలా మంది యాంకర్లు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ప్రదీప్ కూడా  చేరబోతున్నాడు.

దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానప్పటికీ సినిమా మాత్రం షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తోంది. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన మున్నా అనే వ్యక్తి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు.

1947వ కాలంలో జరిగే కథ నేపధ్యంలో సినిమా సాగుతుంది. దీనికి అనూప్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. 

PREV
click me!

Recommended Stories

Nidhhi Agerwal: తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం, పెళ్లి కూడా చేసుకుంటా, నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
Ranabaali Sensor Review: ఒక్క కట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ కామెంట్స్, రణబాలి సెన్సార్ రివ్యూ