సలార్ నిఓటిటిలో చూడటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అంతేకాదు... ఈ సినిమాని చాలా నిశితంగా చూస్తూ అందుకు సంభందించిన పోస్ట్ లు పెడుతున్నారు. ఈ పోస్ట్ ల్లో ఒకటి వైరల్ అవుతోంది.
ప్రభాస్ అభిమానులు ఎదురుచూసినట్లుగా సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం నుంచి నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. థియేట్రికల్, ఓటీటీ రిలీజ్ల మధ్య 8 వారాల గ్యాప్ తప్పనిసరి అనే నిబంధన ఉండటంతో హిందీ వెర్షన్ను రిలీజ్ చేయలేదు.చాలా కాలం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'సలార్' పార్ట్-1తో రెబల్ స్టార్ ప్రభాస్ కమర్షియల్ హిట్ సాధించాడు. ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి దాదాపు 700కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. దాంతో అందరూ సలార్ నిఓటిటిలో చూడటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అంతేకాదు... ఈ సినిమాని చాలా నిశితంగా చూస్తూ అందుకు సంభందించిన పోస్ట్ లు పెడుతున్నారు. ఈ పోస్ట్ ల్లో ఒకటి వైరల్ అవుతోంది.
అదేమిటంటే...సలార్ సినిమాలో ప్రబాస్ ఎంత సేపు మాట్లాడారు అనేది లెక్క వేసి ఓ అభిమాని వీడియోగా వదిలారు. సలార్ డైలాగ్ టైమ్ రఫ్ గా 4 నిముషాలు ఉందని, అదే డైలాగు గ్యాప్స్ లేకుండా చూస్తే కేవలం 2:35 నిముషాలు మాత్రమే ఉందని తేల్చి షాక్ ఇచ్చారు. ప్రభాస్ తక్కువ మాట్లాడారు సలార్ లో అనుకున్నారు కానీ ఇంత తక్కువ అని చాలా మంది గమనించకపోవటంతో ఆశ్చర్యపోతున్నారు.
Prabhas Dialogue time in Salaar (sped up)
Roughly 4 minutes with dialogue gaps and 2:35 min without gaps... https://t.co/aHPhd30Mp5 pic.twitter.com/bxTclXjMcA
ఇక ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘సలార్’.‘కె.జి.ఎఫ్'(సిరీస్) దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో చేసిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండటంలో ఓపినింగ్ కలెక్షన్స్ అదిరిపోయాయి. తర్వాత కూడా సంక్రాంతి సినిమాలు వచ్చేదాకా బాగా ఆడింది. సలార్ సూపర్ హిట్ అవడంతో ప్రభాస్ తన టీమ్ తో కలిసి ఇప్పటికే రెండుసార్లు సక్సెస్ పార్టీ చేసుకున్నారు. రీసెంట్ గా బెంగుళూరులో జరిగిన పార్టీకి ప్రభాస్ , ప్రశాంత్ నీల్, శృతి హాసన్ మరియు నిర్మాతలు టాలీవుడ్ హీరో అఖిల్ లాంటి స్టార్స్ హాజరయ్యారు.
ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హసన్ కీలక పాత్రలు పోషించిన సలార్ సినిమా తొలి భాగం ‘సలార్- సీజ్ ఫైర్’తెలుగు భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్ చూసి రెండో భాగం ‘శౌర్యాంగ పర్వం’ఎప్పుడూ అని అడుగుతున్నారు. అయితే ఇది ప్యాన్ ఇండియా సినిమా. కేవలం తెలుగు మార్కెట్ మాత్రమే కాదు ...హిందీ, కన్నడ, మళయాళ,తమిళ మార్కెట్ లలో కూడా అక్కడ భాషల్లోకి డబ్బింగ్ అయ్యి భారీగా రిలీజ్ అయ్యింది.