500 కోట్ల క్లబ్ లో సలార్... హిట్ కొట్టాలంటే ఇంకా ఎంత రావాలంటే?

Published : Dec 28, 2023, 06:02 PM IST
500 కోట్ల క్లబ్ లో సలార్... హిట్ కొట్టాలంటే ఇంకా ఎంత రావాలంటే?

సారాంశం

ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. మిశ్రమ స్పందన దక్కించుకున్న సలార్ చిత్రం మరో అరుదైన మార్క్ దాటింది. రూ. 500 కోట్ల క్లబ్ లో చేరింది.


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలతో ప్రభాస్ హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేశాడు. సలార్ కొంత మేర ఆయనకు ఉపశమనం కలిగించింది. ఫస్ట్ డే సలార్ రికార్డు ఓపెనింగ్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ. 178.7 కోట్ల గ్రాస్ రాబట్టింది. 2023కి గానూ హైయెస్ట్ ఓపెనింగ్ రికార్డు నమోదు చేసింది. 

మూడు రోజుల్లో రూ. 400 కోట్ల మార్క్ చేసుకున్న సలార్ ఆరు రోజులకు రూ. 500 కోట్ల మైలు రాయిని చేరుకుంది. సలార్ వసూళ్లు ఐదు వందల కోట్ల మార్క్ దాటినట్లు మేకర్స్ తెలియజేశారు. అధికారిక పోస్టర్ విడుదల చేశారు. అయితే బ్రేక్ ఈవెన్ కావాలంటే సలార్ రూ. 600 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా సలార్ కి కీలకం. న్యూ ఇయర్ ఫెస్టివల్ ఉంది. ఆ రోజు సలార్ వసూళ్లు పుంజుకునే అవకాశం ఉంది. ఏడో రోజు వసూళ్లు నెమ్మదించినట్లు సమాచారం. 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రెండు భాగాలుగా విడుదల కానుంది. ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటించింది. మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్ చేశాడు. జగపతిబాబు, ఈశ్వరీ రావు, బాబీ సింహ ఇతర పాత్రలు చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ కు దిమ్మతిరిగే షాక్.. ఇన్‌స్టాగ్రామ్ ఏం చేసిందంటే?
Illu Illalu Pillalu Today Episode Feb 20: భర్త చెంప పగలగొట్టిన నర్మద, భార్య కాళ్లు పట్టుకున్న సాగర్