మూడో వారం కూడా కల్కి వసూళ్లు సాలిడ్ గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఆ ఏరియాలో కల్కి మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుంది.
కల్కి 2829 AD తో ప్రభాస్ క్లీన్ హిట్ అందుకున్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి 2 అనంతరం బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ చిత్రాలు స్ట్రగుల్ అయ్యాయి. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముడు పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రభాస్ ఇమేజ్ దెబ్బతీసింది. దర్శకుడు ఓం రౌత్ రామాయణాన్ని తెరకెక్కించిన తీరు, ప్రధాన పాత్రల గెటప్స్ విమర్శల పాలయ్యాయి. ఓం రౌత్ కారణంగా ప్రభాస్ రాముడు పాత్రకు సెట్ కాడని బాలీవుడ్ సినీ ప్రముఖులు ఎద్దేవా చేశారు.
సలార్ తో ప్రభాస్ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. అయితే ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. ప్రభాస్ మాస్ అవతార్. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఎంజాయ్ చేశారు. కల్కి మూవీ వారి దాహం తీర్చింది. ఒక వినూత్న సబ్జెక్టు తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాడు.
కల్కి ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్ లో ఈ మూవీ విశేష ఆదరణ దక్కింది. విదేశాల్లో కల్కి వసూళ్లు $30 మిలియన్స్ అధిగమించాయి. ఒక్క యూఎస్ లోనే కల్కి $16 మిలియన్ వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ కల్కి రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
కాగా హిందీలో కల్కి మూవీ అంచనాలకు మించి ఆదరణ పొందుతుంది. ఈ వీకెండ్ నార్త్ ఇండియాలో కల్కి వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి. శుక్రవారం కల్కి రూ.4.25 కోట్లు వసూలు చేసింది. శనివారం రూ. 7.95 కోట్లు, ఆదివారం రూ.9.75 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది. మొత్తంగా కల్కి హిందీ వెర్షన్ రూ.255.15 కోట్ల నెట్ వసూళ్లకు చేరుకుంది. బాలీవుడ్ లో ఈ వారం అక్షయ్ కుమార్ నటించిన సర్ఫిరా విడుదలైంది. సురారైపోట్రు చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ మూవీకి కనీస ఆదరణ కరువైంది. కల్కి మూడో వారం వసూళ్ల కంటే సిర్ఫిరా వసూళ్లు తక్కువగా ఉన్నాయి. అది కల్కి చిత్రానికి ప్లస్ అయ్యింది.
continues its heroic run... Biz on [third] Sat - Sun has given it the much-needed push to gallop towards the next milestone: ₹ 275 cr.
[Week 3] Fri 4.25 cr, Sat 7.95 cr, Sun 9.75 cr. Total: ₹ 255.15 cr biz. version. Nett BOC. pic.twitter.com/RzeZ3cQali