SalaarTrailer: ప్రభాస్ 'సలార్' ట్రైలర్ వచ్చేసింది.. డైనోసార్ విధ్వంసం చూశారా, బాక్సాఫీస్ జాతరే ఇక

By Asianet NewsFirst Published Dec 1, 2023, 7:20 PM IST
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్రం కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోకి సరైన డైరెక్టర్ తగిలితే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఆల్రెడీ ఊహించేసుకుంటున్నారు. డైనోసార్ విధ్వంసం సృష్టిస్తే ఎలా ఉంటుందో ట్రైలర్ లో శాంపిల్ చూపించారు. ట్రైలర్ లో ప్రభాస్ మాస్ అండ్ స్టైలిష్ యాటిట్యూడ్ ప్రతి సెకనులో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్రం కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోకి సరైన డైరెక్టర్ తగిలితే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఆల్రెడీ ఊహించేసుకుంటున్నారు. పలుమార్లు వాయిదా పడ్డ సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది.  

దీనితో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సలార్ ట్రైలర్ వచ్చేసింది. ఆల్రెడీ టీజర్ లో ప్రభాస్ ని డైనోసార్ తో పోల్చుతూ ప్రశాంత్ నీల్ ఎలివేషన్ ఇచ్చారు. ఇప్పుడా డైనోసార్ విధ్వంసం సృష్టిస్తే ఎలా ఉంటుందో ట్రైలర్ లో శాంపిల్ చూపించారు. ట్రైలర్ లో ప్రభాస్ మాస్ అండ్ స్టైలిష్ యాటిట్యూడ్ ప్రతి సెకనులో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. డిసెంబర్ 22న బాక్సాఫీస్ అరాచకమే అనే తరహాలో ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 

Latest Videos

దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో విడదీయలేని స్నేహం ఉండేది అంటూ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవుతుంది. వెయ్యేళ్ళ క్రితం అంటూ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. బందిపోట్లు ఆక్రమించుకున్న ప్రాంతం అది. ఖాన్సార్ అనే ప్రాంతంలో కుర్చీ పోరాటం, కుతంత్రాలు జరుగుతుంటాయి. జగపతి బాబు ఒక టిపికల్ పాత్రలో కనిపిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ స్నేహితుడిగా కనిపిస్తున్నారు. 

మనం ఎంత మందిని తెచ్చుకుంటున్నాం.. మన ఆర్మీ ఎక్కడ ఉంది అనే అడుగుతుండగా.. గాడ్ లెవల్ ఎలివేషన్ తో ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు. ట్రైలర్ నిడివి సగం పూర్తయ్యేకే ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. మన ఆర్మీ అతడొక్కడే అనే తరహాలో ప్రశాంత్ నీల్ ప్రభాస్ కి ఎలివేషన్ ఇచ్చారు. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి.. బయటకి ఎవడు పోతాడు అని కాదు.. లోపలికి ఎవడు వస్తాడు అని అంటూ ప్రభాస్ క్యాజువల్ గా చెబుతున్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 

మొత్తంగా ప్రభాస్ పాత్రని మాస్ గా డిజైన్ చేసే బాక్సాఫీస్ వద్ద పెద్ద జాతరే చేయాలనీ ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారు. కేజిఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రవి బిస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన్ గౌడ డీఓపీ గా వ్యవహరిస్తున్నారు. 

 

click me!