RC15: బడ్జెట్ లిమిట్ దాటిపోతున్నా తగ్గని దిల్ రాజు.. ఒక్క పాటకి రూ.8 కోట్లు ?

Published : Oct 23, 2022, 12:14 PM IST
RC15: బడ్జెట్ లిమిట్ దాటిపోతున్నా తగ్గని దిల్ రాజు.. ఒక్క పాటకి రూ.8 కోట్లు ?

సారాంశం

ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం RC15(వర్కింగ్ టైటిల్). దిగ్గజ దర్శకుడు శంకర్ తొలిసారి తెలుగులో చేస్తున్న స్టైట్ మూవీ ఇది.

ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం RC15(వర్కింగ్ టైటిల్). దిగ్గజ దర్శకుడు శంకర్ తొలిసారి తెలుగులో చేస్తున్న స్టైట్ మూవీ ఇది. శంకర్ మ్యాజిక్ వర్కౌట్ అయితే పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ విధ్వంసం ఖాయం అని మెగా ఫాన్స్ ఆశిస్తున్నారు. 

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కమల్ హాసన్ తో శంకర్ ఇండియన్ 2 చిత్రాన్ని తిరిగి ప్రారంభించడంతో రాంచరణ్ చిత్రానికి బ్రేకులు పడ్డాయి. దీనితో ఈ చిత్ర షూటింగ్ మరింతగా ఆలస్యం అవుతోంది. డైరెక్టర్ శంకర్ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో అందరికి తెలుసు. 

తన చిత్రంలో ప్రతి అంశం భారీతనంతో ఉండాలని శంకర్ భావిస్తారు. సాంగ్స్ లో కూడా సెట్టింగులు, భారీ విజువల్స్ ఉంటాయి. వందలాది మందితో రాంచరణ్ ఫైట్ సన్నివేశం, ఎంట్రీ సీన్ ఇలా కోట్లాది రూపాయలతో శంకర్ ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నారు. బడ్జెట్ లిమిట్ దాటిపోతున్నా దిల్ రాజు తగ్గడం లేదట. 

శంకర్ పై ఉన్న నమ్మకంతో దిల్ రాజు బడ్జెట్ కి వెనుకాడడం లేదని టాక్. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో ఒక సాంగ్ కోసం శంకర్ 8 కోట్ల బడ్జెట్ వెచ్చిస్తునట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ లో ఒక చిన్న చిత్రం పూర్తయిపోతుంది. మరి ఆ సాంగ్ సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉండబోతోందో ఊహించుకోవచ్చు. 

ఈ చిత్రంలో రాంచరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న తీరుని బట్టి రిలీజ్ ఇంకా ఆలస్యం అవుతుందని అంటున్నారు. వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. కానీ అది జరిగేలా లేదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా