ప్రభాస్ కి చిరాకొచ్చేసింది!

Published : Mar 22, 2019, 07:52 PM IST
ప్రభాస్ కి చిరాకొచ్చేసింది!

సారాంశం

ప్రభాస్ లాంటి హీరోతో సినిమా చేస్తున్నారు అంటే దర్శకులు యాక్షన్ పార్ట్ కోసం చేసే కసరత్తులు అన్ని ఇన్ని కావు. అభిమానులను దృష్టిలో పెట్టుకొని కొన్ని స్పెషల్ గా డిజైన్ చేయక తప్పదు. కానీ ఇప్పుడు జిల్ దర్శకుడికి ఆ టెన్షన్ లేకుండా చేస్తున్నాడట ప్రభాస్. 

బాహుబలి - సాహో వంటి సినిమాలు చేశాక ప్రభాస్ కి యాక్షన్ అంటే తెగ చిరాకొస్తుందట. యుద్ధ పోరాటాలు కార్ చేజింగ్స్ ఇలా గత ఆరేళ్లుగా ఎక్కువగా యాక్షన్ తోనే గడపడం ఎబ్బెట్టుగా అనిపించిందని టాక్. అందుకే తదుపరి సినిమాలో కొంచెం యాక్షన్ డోస్ కి గ్యాప్ ఇవ్వాలని పూర్తిగా ఎమోషన్ అండ్ డ్రామా కోణాల్లో ఉండేలా సినిమాలు చేయాలనీ డిసైడ్ అయ్యాడు. 

రాధాకృష్ణ తో చేయబోయే లవ్ స్టోరీలో ఒక రెండు భారీ యాక్షన్ సీన్స్ ను ప్రభాస్ తీయించేశాడట. ముందు ప్రభాస్ కోసం ఏళ్ల తరబడి స్క్రిప్ట్ రెడీ చేసుకొని పక్కాగా ప్లాన్ గీసుకున్న దర్శకుడికి అవసరం లేని చోట జొప్పించాలని ట్రై చేయవద్దు. సింపుల్ ఫైట్స్ తో కనిచ్చెయండి అని ప్రభాస్ తన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

RajaSaab కి ఒకవైపు నెగిటివ్ టాక్ వస్తుంటే హీరోయిన్ ఏం చేస్తోందో తెలుసా.. బన్నీని బుట్టలో వేసుకునే ప్రయత్నం ?
Illu Illalu Pillalu Today Episode Jan 13: డబ్బు పోగొట్టిన సాగర్, అమూల్యకు పెళ్లి ఇష్టం లేదన్న వేదవతి