అఫీషియల్: ప్రభాస్.. ఫిప్టీ ఇయర్స్ బ్యాక్ కి ప్రయాణం

Published : Apr 03, 2019, 10:18 AM ISTUpdated : Apr 03, 2019, 10:22 AM IST
అఫీషియల్: ప్రభాస్.. ఫిప్టీ ఇయర్స్ బ్యాక్ కి ప్రయాణం

సారాంశం

ప్రభాస్ ఇప్పుడు ప్రయోగాల మూడ్ లో ఉన్నారు. పునర్జన్మల నేపధ్యంలో ఓ చిత్రం చేస్తున్నారు.

ప్రభాస్ ఇప్పుడు ప్రయోగాల మూడ్ లో ఉన్నారు. పునర్జన్మల నేపధ్యంలో ఓ చిత్రం చేస్తున్నారు. ‘జిల్‌’ చిత్రంతో విభిన్న చిత్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాధాకృష్ణ ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమాను చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రం  1970 నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ విష‌యంలో స్వ‌యంగా ద‌ర్శ‌కుడు రాధాకృష్ణనే ప్రేక్ష‌కుల‌కు తెలియచేసాడు. 

ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్త‌యిన‌ట్లు వెల్ల‌డించిన అత‌ను.. ఇదొక కాలాతీత‌మైన ఇద్ద‌రు ప్రేమికుల క‌థ అని.. 1970ల నాటి కాలంలో  యూర‌ప్ నేప‌థ్యంలోనే సాగుతుందని వెల్ల‌డించాడు. అంటే ప్ర‌భాస్ దాదాపు ఫిఫ్టీ ఇయిర్స్ బ్యాక్ కు వెళ్లిపోతాడన్నమాట.  

అందుతున్న సమాచారం మేరకు 1970లో యూరప్‌ మరియు ఇండియాలో జరిగిన ఒక ప్రేమ కథను దర్శకుడు చూపించబోతున్నాడు. రీసెంట్ గా  1980 నాటి వాతావరణంతో రంగస్దలం చిత్రం తీసి ఈ తరంకు దర్శకుడు సుకుమార్‌ చూపించారు. ఇక 1970 నాటి మరింత ఆసక్తికర విషయాలను ఈ సినిమాలో  చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అలాగే ఈ సినిమాలో  ఎక్కువ శాతం ఈ చిత్రాన్ని యూరప్‌లోనే చిత్రీకరించనున్నారు. యూరప్‌లో 1970 నేపథ్యంలో చిత్రాన్ని చేయడంతో పాటు, పునర్జన్మ కథ కావటంతో ఈ కాలం నాటి  కొన్ని మోడ్రన్‌ డేస్‌ సీన్స్‌ను కూడా చేయబోతున్నారు. ఈ చిత్రం ఒక విభిన్నమైన ఫాంటసీ సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Gunasekhar: ప్లాప్ ఇస్తే ఫోన్ కూడా ఎత్తరు.. వరుడు తర్వాత బన్నీ.. గుణశేఖర్ ఓపెన్ కామెంట్స్
Samantha: మళ్లీ పేరు మార్చుకోనున్న సమంత? కొత్త సినిమా టైటిల్ కార్డులో ఇదే పేరు?