జిమ్‌ ట్రైనర్‌కి ప్రభాస్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌.. షాక్‌లో ట్రైనర్‌

Published : Sep 05, 2020, 05:38 PM ISTUpdated : Sep 05, 2020, 05:39 PM IST
జిమ్‌ ట్రైనర్‌కి ప్రభాస్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌.. షాక్‌లో ట్రైనర్‌

సారాంశం

స్టార్‌ హీరోస్‌.. తన వద్ద పనిచేసే వర్కర్లకి, ట్రైనర్లు, డ్రైవర్లకి ఏదో టైమ్‌లో సర్‌ప్రైజ్‌ ఇస్తుంటాడు.  ప్రభాస్‌ ఇప్పుడు అదే చేశాడు. తన వద్ద పనిచేసే పర్సనల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లక్ష్మణ్‌కి ఖరీదైన కారుని బాహుమతిగా ఇచ్చి షాక్‌తోపాటు ఆశ్చర్యానికి గురి చేశాడు. 

ప్రభాస్‌ తన పెద్ద మనసుని చాటుకున్నారు. తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌కి సర్‌ఫ్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. దీంతో అభిమాని ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. మరి తన ట్రైనర్‌కి ప్రభాస్‌ ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలిస్తే షాక్‌ అవుతారు.  

స్టార్‌ హీరోస్‌.. తన వద్ద పనిచేసే వర్కర్లకి, ట్రైనర్లు, డ్రైవర్లకి ఏదో టైమ్‌లో సర్‌ప్రైజ్‌ ఇస్తుంటాడు. ఊహించని గిఫ్ట్‌లతో ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ప్రభాస్‌ ఇప్పుడు అదే చేశాడు. తన వద్ద పనిచేసే పర్సనల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లక్ష్మణ్‌కి ఖరీదైన కారుని బాహుమతిగా ఇచ్చి షాక్‌తోపాటు ఆశ్చర్యానికి గురి చేశాడు. 

ఏకంగా లక్షల విలువ చేసే రేంజ్‌రోవర్‌ కారుని బహుమతిగా డార్లింగ్‌ స్టార్‌ ప్రభాస్‌ ఇవ్వడంతో లక్ష్మణ్‌ ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. ఈ విషయాన్ని ప్రభాస్‌ ఫ్యాన్స్ ట్రెండ్‌ గ్రూప్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ట్రెండ్‌ చేస్తున్నారు. మా సాహో స్టార్‌ మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారని చెబుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం ప్రభాస్‌ `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌ ఓ సైన్స్ ఫిక్షన్‌ చేయబోతుండగా ఇందులో దీపికా పదుకొనె కథానాయిక. దీంతోపాటు ఓం రౌత్‌ డైరెక్షన్‌లో బాలీవుడ్‌ చిత్రం `ఆదిపురుష్‌`లో నటించనున్న విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్
Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో