#Prabhas: ఛీఫ్ గెస్ట్ గా ప్రభాస్ రానున్నాడా?

Published : Mar 01, 2024, 01:58 PM IST
 #Prabhas: ఛీఫ్ గెస్ట్ గా ప్రభాస్ రానున్నాడా?

సారాంశం

 ఈ ఈవెంట్ కు ఛీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారు అంటే ప్రభాస్ అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


ప్రభాస్ ఛీఫ్ గెస్ట్ గా ఓ ఈవెంట్ కి హాజరయ్యారంటే ఖచ్చితంగా ఆ సినిమాపై అందరి దృష్టీ పడుతుంది. అయితే అన్ని సినిమాలకు ఆయన రారు కదా. ఆయనకు నచ్చిన లేదా తన వాళ్లు అనుకున్న వాళ్ల సినిమాలకే ఆయన హాజరవుతూంటారు. అలా అప్పడప్పుడూ స్టేజిపై ప్రభాస్ మెరిసి తన ఫ్యాన్స్ ని అలరిస్తూంటారు. అలా ఇప్పుడో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ ఛీఫ్ గెస్ట్ గా రాబోతున్నారనే టాక్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏమిటా సినిమా?

ఆ చిత్రం మరేదో కాదు గోపీచంద్‌ (Gopichand) తాజా ప్రాజెక్ట్‌ భీమా (BHIMAA). గోపీచంద్ 31(GopiChand 31)గా తెరకెక్కిన  ఈ చిత్రాన్ని కన్నడ డైరెక్టర్‌ ఏ హర్ష (A Harsha)డైరక్ట్ చేసారు. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. మార్చి 8న గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో గోపీచంద్‌ టీం ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ ప్లానింగ్‌లో బిజీగా ఉంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్‌. భీమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హన్మకొండ (వరంగల్‌)లోని కాకతీయ గవర్నమెంట్‌ కాలేజ్‌లో రేపు సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించనున్నట్టు తెలియజేస్తూ గోపీచంద్‌ స్టైలిష్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ ఈవెంట్ కు ఛీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారు అంటే ప్రభాస్ అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అయితే  ఈ ఈవెంట్‌కి ప్రభాస్ వస్తున్నారా లేదా అనే విషయం అఫీషియల్ గా ఎక్కడా బయిటకు రాలేదు. ఇప్పటిదాకా గెస్టు ఎవరనే విషయాన్ని మాత్రం సస్పెన్స్‌గా ఉంచింది టీమ్. దాంతో  గోపీ చంద్ ఫ్యాన్స్ మాత్రం ఈవెంట్‌కి ప్రభాస్ గెస్టుగా వస్తున్నారంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చల్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ విషయమై మూవీ టీమ్ రియాక్ట్ అవ్వలేదు. అయితే ఇలా స్పెక్యులేట్ చేయటానికి ఓ కారణం ఉంది. గోపీ చంద్- ప్రభాస్ బెస్టు ఫ్రెండ్స్. గతంలో కూడా గోపీ చంద్ అనేక సినిమాల ఈవెంట్స్‌కి ప్రభాస్ హాజరయ్యారు. దీంతో మరోసారి భీమా కోసం ప్రభాస్ వస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా గోపీచంద్ కెరీర్ పరిస్దితి అగమ్య గోచరంగా తయారైంది. అసలే ఏ సినిమా చేస్తే ఆ సినిమా డిజాస్టర్ అయ్యిపోతోంది గోపిచంద్ కు.  వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న  గోపీ చంద్ కొద్దిగా హిట్ తో ఊపిరి పీల్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఆశలతో తీసిన రామ బాణం కూడా ఫ్లాప్ అయింది.ఈ క్రమంలో తనకు అచ్చివచ్చిన పాత్రలో మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనపడనున్నారు. ఈ యాక్షన్ డ్రామాతో గోపీ చంద్ హిట్టు కొట్టాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో ఈ సినిమాకు ఓపినింగ్స్ బాగా రావాలి కదా.. అందుకు రంగం సిద్దమైంది. 


 
ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష డైరెక్ట్ చేస్తున్న భీమా సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  గోపిచంద్ హై వోల్టేజ్ అవతార్‌లో కనిపిస్తున్నాడు.    ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్ సినిమాలు గోపి కెరీర్ లొనే బెస్ట్ మూవీస్ గా నిలిచాయి.  భీమా సినిమాకు స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమాలో రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ కొరియోగ్రఫీలో ఫైట్స్ ఉండబోతున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్