Adipurush Trailer: వంద థియేటర్స్ లో ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్... లిస్ట్ ఇదే!

Published : May 04, 2023, 01:13 PM ISTUpdated : May 04, 2023, 04:13 PM IST
Adipurush Trailer: వంద థియేటర్స్ లో ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్... లిస్ట్ ఇదే!

సారాంశం

ఆదిపురుష్ ప్రమోషన్స్ టీం భారీగా నిర్వహిస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. వందకు పైగా థియేటర్స్ లో ఆదిపురుష్ త్రీడీ ట్రైలర్ విడుదల కానుంది.   

హీరో ప్రభాస్ నుండి మరో భారీ ప్రాజెక్ట్ వస్తుంది. పౌరాణిక చిత్రం ఆదిపురుష్ జూన్ 16న విడుదల కానుంది. చిత్ర విడుదలకు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ట్రైలర్ నభూతో నభవిష్యతి అన్న రీతిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఆదిపురుష్ ట్రైలర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 105 థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ఏపీ/తెలంగాణా రాష్ట్రాల్లో ఆదిపురుష్ ట్రైలర్ విడుదల చేసే థియేటర్స్ లిస్ట్ విడుదల చేశారు. 

మే 9న ఆదిపురుష్ త్రిడీ ట్రైలర్ విడుదల కానుంది. సాయంత్రం 5:30 నిమిషాలకు థియేటర్స్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆదిపురుష్ టీజర్ విమర్శల పాలైంది. విజువల్స్, ప్రధాన పాత్రల గెటప్స్ పై వ్యతిరేకత వ్యక్తమైంది. ట్రైలర్ విషయంలో అలా జరగకూడదని థియేటర్స్ లో విడుదల చేసి త్రీడీ ఎక్ప్పీరియన్స్ తో థ్రిల్ చేయాలని మేకర్స్ ఆలోచన. ఆ విధంగా గతంలో ఎదురైన విమర్శలను అధిగమించాలని చూస్తున్నారు. 

ఆదిపురుష్ టీజర్ లో విజువల్స్ కార్టూన్ పిక్టర్స్ ని తలపించాయని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఓం రౌత్ ఈ విమర్శలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆదిపురుష్ మూవీ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ దృష్టిలో ఉంచుకొని తీసిన చిత్రం. మొబైల్స్, ఇతర డివైసెస్ లలో చూసి మీకు అంతగా నచ్చకపోయి ఉండవచ్చని ఆయన అన్నారు. టీజర్ చూశాక ఓం రౌత్ కి ప్రభాస్ వార్నింగ్ ఇచ్చాడనే ప్రచారం కూడా జరిగింది. 

ఈ క్రమంలో ట్రైలర్ తో ప్రేక్షకులను మెప్పించాల్సిన బాధ్యత ఓం రౌత్ పై ఉంది. టి సిరీస్ సంస్థ ఆదిపురుష్ చిత్రాన్ని నిర్మించింది. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ రావణుడుగా కనిపించనున్నారు. వరల్డ్ వైడ్ ఆదిపురుష్ ఐదు భాషల్లో భారీగా విడుదల కానుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: స్వప్నను తాళి తీసేయమన్న శ్రీధర్- నోరుజారిన పారు-బాధలో దీప, కార్తీక్
Chiranjeevi: ఆ కుర్రాడి కోసం తన సినిమా షూటింగ్ నే ఆపేసిన చిరంజీవి..ఇప్పుడు అతడే మెగాస్టార్ కి పోటీగా దిగాడు