ప్రభాస్ 'ఆది పురుష్' ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..

By Surya Prakash  |  First Published Mar 25, 2021, 8:36 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావసణుడిగా నటిస్తున్నాడు. సీతగా కృతి సనన్‌ నటిస్తోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది.  

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ షూటింగ్ ముంబై లో మొదలైపోయింది. ఆదిపురుష్ సెట్స్ లో ఎంతో ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉంటుంది అంటూ ఓం రౌత్ ఈ మధ్యన ఓ ఇంటర్వ్యూలో  చెప్పాడు. ఇక ఆదిపురుష్ సినిమా రామాయణం నేపధ్యలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. సినిమాలో ప్రభాస్ రాముడిగా ఎలా ఉంటాడో అనే క్యూరియాసిటి ప్రభాస్ ఫాన్స్  లో మాత్రమే కాదు..సినిమా లవర్స్ లోనూ ఉంది.  ఆదిపురుష్ లో ప్రభాస్ లుక్ ఎప్పుడు విడుదల చేస్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ విషయమై ఓ అప్ డేట్ రూమర్ లా మొదలైంది. ఏప్రిల్ లో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ప్రభాస్ రాముడు లుక్ వదలబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  

Latest Videos

రాముడి పాత్ర కోసం ప్రభాస్‌ భారీ కసరత్తు చేస్తున్నాడట. పాత్రకు తగ్గట్టుగా కొంచెం స్లిమ్‌ లుక్‌లో కనబడనున్నారు. అందుకోసం ముంబయ్‌లో రోజుకి ఉదయం, సాయంత్రం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. కొన్ని కిలోల బరువు తగ్గించే పని మీద ఉన్నారట.  హైదరాబాద్‌లో ‘సలార్‌’ షెడ్యూల్‌ పూర్తి చేసిన ప్రభాస్‌, ‘ఆదిపురుష్‌’ కోసం ముంబయ్‌ వెళ్లారు. అక్కడ ఓ  భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. టీ-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్,  ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, ఓం రౌత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేసి తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా ఈ చిత్రాన్ని  రిలీజ్ చేయనున్నారు. 
 
click me!