మొన్నటి వరకూ పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇంత బిజీగా.. ఏ స్టార్ లేరనే చెప్పాలి. ఇప్పటికే నాలుగు సినిమాలు సెట్స్ ఎక్కించిన పవర్ స్టార్.. ప్రస్తుతం మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం నాలుగు సినిమాలు కంప్లీట్ చేయడమే టార్గెట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెస్ట్ లెస్ గా పనిచేస్తున్నారు. ఎలక్షన్ టైమ్ దగ్గర పడేలోపు సినిమాలన్నీ కంప్లీట్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. అందేకే టైమ్ ఫిక్స్ చేసుకుని.. ఎన్ని సినిమాలు కంప్లీట్ చేయవచ్చు అనేది బేరీజు వేసుకుని మరీ.. కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ఇస్తున్నాడు పవన్. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ వరుసగా ప్లాప్ డైరెక్టర్లకే అవకాశం ఇస్తున్నాడు.
ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లలో బిజీగా గడుపుతున్న పవన్ మరో వారం రోజుల్లో సుజీత్‌తో ఓజీ షూటింగ్ సెట్‌లో జాయిన్ కానున్నాడు. ఓజీకి సబంధించిన అనౌన్స్ మెంట్ తాజాగా ఇచ్చారు టీమ్. మరో వైపు ఇది చేస్తూనే.. హరిహర వీరమల్లు కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న పవన్ మరో యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఇప్పటి వరకూ చేస్తున్న సినిమాల సంగతి చూస్తే.. హరీష్ శంకర్, సముద్ర ఖని ఇద్దరిని పక్కన పెడితే.. క్రిష్ వరుస ప్లాపులతో ఉన్నాడు. ఆయనతో హిస్టారికల్ మూవీ హరిహరవీరమల్లు చేస్తున్నాడు పవన్. ఇటు ఓజీ చేస్తున్న సుజిత్ కూడా ప్రభాస్ తో సాహో చేసి.. పాన్ ఇండియా లెవల్లో గట్టిగా దెబ్బ తిని ఉన్నాడు. ఇక ఈక్రమంలో మరో ప్లాప్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట పవర్ స్టార్.
నిఖిల్ తో స్వామిరారా సినిమా చేసి.. టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సుధీర్ వర్మ. రీసెంట్ గా రావణాసుర సినిమాతో పెద్ద ప్లాప్ ను చూసిన సుధీర్ తో.. పవర్ సినిమా అంటూ..ఎప్పటినుంచో టాక్ నడుస్తూనే ఉంది. ఏడాదిగా ట్రై చేస్తుంటే..సుధీర్ కు రీసెంట్ గా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ఈ సినిమాను సితార సంస్థ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించనున్నాడట. అయితే ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ త్రివిక్రమ్ అందించనున్నట్టు సమాచారం.