ఇబ్బంది పెడతానని సురేందర్ రెడ్డి ముందే చెప్పాడు, అఖిల్ కామెంట్స్...థియేటర్ లో ఏజెంట్ మామూలుగా ఉండదన్న హీరో..

Published : Apr 16, 2023, 07:45 AM IST
ఇబ్బంది పెడతానని సురేందర్ రెడ్డి ముందే చెప్పాడు, అఖిల్ కామెంట్స్...థియేటర్ లో ఏజెంట్ మామూలుగా ఉండదన్న హీరో..

సారాంశం

రిలీజ్ కు రెడీగా ఉంది అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో అఖీల్ కంప్లీట్ గా డిఫరెంట్ గామేకోవర్ అయ్యాడు. ఆశలన్నీ ఈసినిమా మీదనే పెట్టుకున్నాడు అఖిల్. ఇక తాజాగా ఈమూవీ విశేషాలు  మీడియా మీట్ ద్వారా పంచుకున్నారు టీమ్. ఈసందర్భంగా అఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 

అక్కినేని వారి వారసుడు .. అఖిల్ హీరోగా  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా  ఏజెంట్. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా ద్వారా సాక్షీ వైద్య హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. చాలా కాలం క్రితం స్టార్ట్ అయిన ఈసినిమా.. ఎన్నో అవాంతరాలు దాటుకుని.. షూటింగ్ ముగించుకుని.. మరోసారి కొన్ని రీషూట్లు చేసుకుని.. ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ నెల 28 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఏజంట్ సినిమా.  ఇక  ఈ నేపథ్యంలో ఈ సినిమా విశేషాలు పంచుకుంటూ... ప్రెస్ మీట్ ను నిర్వహించింది ఏజెంట్ టీమ్. ఈసందర్భంగా అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. దర్శకుడుసురేందర్ రెడ్డి తనను ఇంబ్బది పెట్టాడన్నారు. ఈ విషయాన్ని తనకు ముందే చెప్పాడంటూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 

ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ఏజెంట్ మోస్ట్ మెమరబుల్ జర్నీ. మెంటల్ గా ఫిజికల్ గా నా జీవితాన్ని మార్చిన చిత్రమిది. ‘నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను ,మీరు పడాలి’ అని సురేందర్ రెడ్డిగా నాకు ముందే చెప్పేశారు. ఆ రోజే ఆయనకి మాటిచ్చాను. ఆ ప్రామిస్ తో సినిమా పూర్తి చేశాం. ఈ రోజు నేను కొత్తగా కనిపిస్తున్నానంటే కారణం సురేందర్ రెడ్డి గారే. ఆయన నన్ను ఇలా ఇమాజిన్ చేసి చూపించారు. నేను ఆయన్నే ఫాలో అయ్యాను. ఆయన పూర్తి న్యాయం చేశారు. ఏజెంట్ జర్నీ చాలా తృప్తిని ఇచ్చింది. ఏజెంట్ మానసికంగా బలాన్ని ఇచ్చింది అని అన్నారు అఖిల్ 

ఇక ఈసినిమా  జర్నీలో చాలా మంది భాగమయ్యారు. హీరోయిన్ సాక్షి చాలా చక్కగా చేసింది. ఈ సినిమాతో ఆమెకు మరెన్నో అవకాశాలు వస్తాయి. మమ్ముటీ గారు నా స్ఫూర్తి. ఆయనతో వర్క్ చేయడం వెరీ మెమరబుల్. చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయనతో స్క్రీన్ పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. ఆయన సెట్లో ఉంటేనే ఆయన చుట్టూ ఒక ఆరా ఉన్నట్టుగా అనిపించేది. తెలుగులోనే ఆయన మాట్లాడేవారు. అలంటి ఒక సీనియర్ స్టార్ తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను.  

రసూల్ గారు సినిమా టోన్ కి బ్యాక్ బోన్. ఏజెంట్ జర్నీ క్రేజీగా ఉంది. క్యారెక్టర్ వైల్డ్ గా ఉంటుంది.  ఏజెంట్  హై ఆక్టేవ్ రోలర్ కోస్టార్ రైడ్.. థియేటర్ లో హై మాములుగా వుండదు. ఈ క్రేజీ నెస్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఇలాంటి సినిమాని అనిల్ గారు లాంటి నిర్మాతలే చేయగలుతారు. ఏజెంట్ తో ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ మూవీ ఇస్తున్నామని ఆయన మొదటి రోజు నుంచి చెప్పారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటి వరకూ లవర్ బాయ్ గా కనిపించిన అఖిల్.. ఈసినిమాలో రా ఏజంట్ గా కనిపించనున్నాడు. రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో.. సిక్ ఫ్యాక్ లో భారీ దేహంతో అఖిల్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన అఖిల్ లుక్స్ చూసి.. అక్కినేని ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. అఖిల్ బీస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈసినిమాతో అఖిల్ తిరుగులేని క్రేజ్ సాధిస్తాడు అని నమ్మకంతో ఉన్నాడు. అంతే కాదు ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో.. 5 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈసారి ఈసినిమాతో అయినా..అఖిల్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా  చూడాలి మరి. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు