వాణీ జయరాం పార్థీవదేహానికి పోస్ట్ మార్టం పూర్తి.. కడసారి చూసేందుకు భారీగా తరలొచ్చిన అభిమానులు..

By Aithagoni RajuFirst Published Feb 4, 2023, 7:13 PM IST
Highlights

ప్రముఖ గాయనీ వాణీ జయరాం  భౌతికకాయానికి చెన్నైలోని ఒమేదురార్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. తాజాగా పోస్ట్ మార్టం పూర్తయ్యింది. 

ప్రముఖ గాయనీ వాణీ జయరాం ఈ రోజు ఉదయం అనుమానాస్పద స్థితిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మరణంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో్వైపు ఆమె భౌతికకాయానికి చెన్నైలోని ఒమేదురార్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. తాజాగా పోస్ట్ మార్టం పూర్తయ్యింది. వాణీ జయరాం నివసించే అపార్ట్ మెంట్‌కి తరలిస్తున్నారు. అయితే అభిమాన గాయనిని కడసారి చూసేందుకు ఆమె అపార్ట్ మెంట్‌కి తరలి వస్తున్నారు. 

అయితే వాణీ జయరాం భౌతిక కాయానికి ఎప్పుడు అంత్యక్రియలు నిర్వహించాలనే దానిపై వారి కుటుంబ సభ్యులు చర్చించినిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై రేపు స్పష్టత రానుంది. మరోవైపు వాణీ జయరాం పోస్ట్ మార్టంలో ఏం రాబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆ రిపోర్ట్ కి ఇంకా టైమ్‌ పడుతుంది. అది ఈ రోజు రాత్రి వరకు వెల్లడిస్తారా? రేపు(ఆదివారం) రిపోర్ట్ వివరాలు వెల్లడిస్తారా? అనేది క్లారిటీ రావాల్సింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బట్టి వాణీ జయరాం అంత్యక్రియలు ఉంటాయని తెలుస్తుంది.

వాణి జయరాం మృతిని పోలీసులు అనుమానస్పద మృతి కేసుగా నమోదు చేశారు. ఆమె ఈ రోజు ఉదయం పది, పదకొండు గంటల మధ్యలో తన ఇంట్లో గాయాలతో పడి ఉన్న విషయం తెలిసిందే. ఇంట్లో పనిచేసే పనిమనిషి ఇది గమనించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె కన్నుమూసినట్టు వైద్యులు నిర్థారించారు. అయితే ఆమె ఎలా చనిపోయిందనేదానిపై పోలీసులు విచారిస్తున్నారు. థౌజండ్‌ లైట్స్‌ పోలీస్‌ స్టేషన్‌కి చెందిన పోలీసులు వాణి మరణంపై ఐపీసీ సెక్షన్‌ 174కింద కేసు నమోదు చేశారు.

 అందులో భాగంగా ఇప్పటికే ఇంటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.  గత నెల(జనవరి) 26 నుంచి వాణి ఇంట్లో ఇంటరిగానే ఉంటున్నట్టు గుర్తించారు. మరోవైపు ఫోరెన్సిక్‌ నిపుణులు ఇంట్లో ఆధారాలు సేకరిస్తున్నారు. చివరగా వాణీ ఎవరితో మాట్లాడారు, ఎవరెవరు వచ్చిపోయారు అనేది ఆరా తీస్తున్నారు. మరోవైపు వాణీ జయరాం మరణించినా, ఆమె తరపున బంధువులు ఎవరూ ఇప్పటి వరకు రియాక్ట్ కాకపోవడం కూడా పలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తుంది.  
 

click me!