సినిమాలపై పవన్ ఇన్ డైరెక్ట్ కామెంట్!

Published : May 13, 2019, 03:40 PM IST
సినిమాలపై పవన్ ఇన్ డైరెక్ట్ కామెంట్!

సారాంశం

  ఇతర స్టార్ హీరోల సినిమాలు రిలీజయితే పవర్ స్టార్ అభిమానుల్లో ఎదో తెలియని బాధ ఉందని చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని తెరపై టైటిల్ పడగానే ఉత్సహంతో ఎగిరే రోజులు మళ్ళీ వస్తాయా? అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇతర స్టార్ హీరోల సినిమాలు రిలీజయితే పవర్ స్టార్ అభిమానుల్లో ఎదో తెలియని బాధ ఉందని చెప్పవచ్చు. తమ హీరో సినిమా ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని తెరపై టైటిల్ పడగానే ఉత్సహంతో ఎగిరే రోజులు మళ్ళీ వస్తాయా? అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

ఇటీవల చాలా మంది మిస్ యు పవర్ స్టార్ అని సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేశారు. కానీ చాలా వరకు పవన్ రాజకీయాల్లో సరికొత్త అడుగులు వేస్తుండడం ఫ్యాన్స్ కి  ఆనందాన్ని కలిగిస్తోంది. మరో పది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తాయి. అయితే పవన్ చిరకాల రాజకీయాల్లో కొనసాగాడని మళ్ళీ సినిమాల్లోకి వెళ్లిపోతాడని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. 

పవన్ మాత్రం గెలుపోటములతో సంబంధం లేకుండా ముందుకు సాగాలని చెబుతున్నాడు. ఐదేళ్ల పాలన కోసం కాకుండా రానున్న 25 ఏళ్ల భవిష్యత్తు కోసం జనసేన పని చేయాలనీ ఇటీవల జరిగిన మీటింగ్ లో తెలిపాడు. ప్రజలకు దగ్గరయ్యేందుకు రాజకీయాల్లోనే కోనసాగాలని అన్నాడు. అంటే పవన్ నుంచి వచ్చే ఏడాది ఒక సినిమా వస్తుందని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పవచ్చు. 

ఇదివరకే కొన్ని నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్ తీసుకున్న పవన్ వారికి మళ్ళీ రెమ్యునరేషన్ ని తిరిగిచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి పవన్ ఇప్పట్లో అయితే సినిమా చేసే ఆలోచనలో లేనట్లు అర్ధమవుతోంది.  

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్