నా చాల్తీ లేచిపోయేది.. ఇలా చేస్తే సినిమా అవకాశాలు కూడా ఇవ్వరు!

Published : Jul 31, 2019, 06:15 PM ISTUpdated : Jul 31, 2019, 06:16 PM IST
నా చాల్తీ లేచిపోయేది.. ఇలా చేస్తే సినిమా అవకాశాలు కూడా ఇవ్వరు!

సారాంశం

నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశం నిర్వహించి మరోసారి తన ఆరోగ్య గురించి క్లారిటీ ఇచ్చారు. ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్ సోకడం వల్ల మరోసారి అనారోగ్యానికి గురైనట్లు పోసాని తెలిపారు. మాటిమాటికి జ్వరం రావడం, చెమటలు పడుతుండడంతో బాగా నీరసించిపోయా. 

నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశం నిర్వహించి మరోసారి తన ఆరోగ్య గురించి క్లారిటీ ఇచ్చారు. ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్ సోకడం వల్ల మరోసారి అనారోగ్యానికి గురైనట్లు పోసాని తెలిపారు. మాటిమాటికి జ్వరం రావడం, చెమటలు పడుతుండడంతో బాగా నీరసించిపోయా. తక్కువ సమయంలోనే 10 కేజీల బరువు తగ్గా. దీనితో చనిపోతానేమోనని భయం వేసింది. 

తనకు ఆపరేషన్ చేసిన వైద్యుడు ఇన్ఫెక్షన్ సోకిందని గుర్తించడంతో చాలా మేలు జరిగింది. లేకుంటే ఈ పాటికి నా చాల్తీ లేచిపోయేది అని పోసాని అన్నారు. మరోసారి ఆపరేషన్ చేసి ఇన్ఫెక్షన్ తొలగించడంతో ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని పోసాని అన్నారు. 

రెండు సార్లు ఆపరేషన్ జరిగిందంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. మీడియాలో కూడా విషమ పరిస్థితుల్లో పోసాని అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు భయపడాల్సిందేమీ లేదు. నా ఆరోగ్యం గురించి పుకార్లు సృష్టించడం వల్ల సినిమాల్లో అవకాశాలు తగ్గుతాయి. పోసాని ఇకనటించగలడో లేదో అని అవకాశాలు ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వరు. 

అందువల్ల ఇకపై తన ఆరోగ్యం గురించి ఎలాంటి పుకార్లు రాకుండా క్లారిటీ ఇవ్వడానికే ఈ మీడియా సమావేశం నిర్వహించినట్లు పోసాని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది