'RX100' హీరో సినిమా కొనేవాళ్లేలేరా..?

Published : Jul 11, 2019, 01:56 PM IST
'RX100' హీరో సినిమా కొనేవాళ్లేలేరా..?

సారాంశం

'RX100' సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ దక్కించుకున్నాడు హీరో కార్తికేయ.. సైలెంట్ గా వచ్చిన ఆ సినిమా భారీ విజయాన్ని అందుకొని నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. 

'RX100' సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ దక్కించుకున్నాడు హీరో కార్తికేయ.. సైలెంట్ గా వచ్చిన ఆ సినిమా భారీ విజయాన్ని అందుకొని నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దీంతో ఇండస్ట్రీలో కార్తికేయకు అవకాశాలు పెరిగాయి. తన రెండో సినిమా 'హిప్పీ' భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడంతో నిర్మాతలు నష్టాలపాలయ్యారు. సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. చాలా రియాల్లో నిర్మాతలు స్వయంగా విడుదల చేసుకోవడంతో నష్టం మరింత ఎక్కువైంది.

'RX100'తో వచ్చిన క్రేజ్ 'హిప్పీ'తో చతికిలపడింది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ కార్తికేయ కొత్త సినిమా 'గుణ 369'పై కూడా పడింది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల.. కార్తికేయ హీరోగా 'గుణ 369' రూపొందిస్తున్నాడు. ఈ సినిమా కోసం కూడా బాగానే ఖర్చుపెట్టారు. ఈ సినిమాకి బిజినెస్ బాగా జరుగుతుందని ఆశ పడ్డారు.

కానీ అలా జరగడం లేదు. 'హిప్పీ' సినిమా ఎఫెక్ట్ తో  'గుణ 369' సినిమాను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. పైగా సినిమాను ఆగస్ట్ 30న విడుదల చేయాలనుకుంటున్నారు. అదే రోజు హీరో నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' విడుదల కానుంది.

నాని సినిమాతో పోటీ అంటే వసూళ్లపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. అందుకే కార్తికేయ సినిమాను ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ నిర్మాతలు మాత్రం ఈ సినిమాను ఏదొక రేటుకి అమ్మేయాలని చూస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి! 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?