చచ్చిపోయేంత కాదు.. వైద్యులు బతికించారు.. వదంతులపై పోసాని!

Published : Jul 14, 2019, 01:41 PM IST
చచ్చిపోయేంత కాదు.. వైద్యులు బతికించారు.. వదంతులపై పోసాని!

సారాంశం

గత కొన్ని రోజులుగా నటుడు, దర్శకుడు అయిన పోసాని ఆరోగ్యంపై అనేక వార్తలు వస్తున్నాయి. పోసాని ఆరోగ్యం విషమంగా ఉందని, చికిత్స పొందుతున్నారని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. 

గత కొన్ని రోజులుగా నటుడు, దర్శకుడు అయిన పోసాని ఆరోగ్యంపై అనేక వార్తలు వస్తున్నాయి. పోసాని ఆరోగ్యం విషమంగా ఉందని, చికిత్స పొందుతున్నారని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలతో పోసాని ఆరోగ్యంపై చిత్ర పరిశ్రమలో కూడా ఆందోళన నెలకొంది. తాజాగా పోసాని తన గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. 

చాలా రోజులుగా నా ఆరోగ్యం విషమంగా ఉందని మీడియాలో వార్తలు వస్తున్నట్లు నా స్నేహితులు తెలిపారు. నిజమే నాకు అనారోగ్యం వచ్చింది. కానీ చచ్చిపోయేంత కాదు అని పోసాని తెలిపారు. యశోద ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా. వైద్యులు నన్ను బతికించారు. ఇప్పుడు ఇలా బాగానే ఉన్నానని పోసాని నవ్వుతూ మాట్లాడారు. 

ఇకపై నా ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన వద్దు. త్వరలో షూటింగ్స్ కి హాజరు కాబోతున్నా. తిరిగి మీ అందరికి వెండితెరపై కనిపిస్తా అని పోసాని తెలిపారు. తాను బావుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు పోసాని వీడియో ద్వారా అభిమానులకు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్