సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే ఇంతకు ముందు రోజుల్లో రీమేక్ రైట్స్ అమ్ముడుపోవటమే కాకుండా శాటిలైట్ రైట్స్ బాగా వచ్చేవి. దాదాపు బడ్జెట్ తో సమానంగా శాటిలైట్ రైట్స్ వచ్చి నిర్మాతను ఆనందంలో ముంచెత్తేవి. ఇప్పుడు శాటిలైట్ రైట్స్ కు మరొకటి యాడ్ అయ్యింది. అదే డిజిటైల్ రైట్స్ . అందులో ఓటిటి రైట్స్ కు భారీ మొత్తాలు నిర్మాతలకు అందుతున్నాయి. ఇప్పుడు నాంది కూడా అలాంటి భారీ ఆఫర్ పొందిందని సమాచారం.

వివరాల్లోకి వెళితే...గత కొంతకాలంగా సరైన హిట్ అనేది లేక ఇబ్బందులు పడుతున్న అల్లరి నరేష్‌కు నాంది చిత్రం పూర్తి స్దాయి రిలీఫ్ ఇచ్చింది. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. రిలీజైన రోజు నుండే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళతో దూసుకుపోతున్న ఈ చిత్రంకి ఇప్పటికే దిల్ రాజు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు అల్లు అరవింద్. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను 2.50 కోట్లకు కొనుగోలు చేశారు. అతి త్వరలోనే ఈ సినిమా ఆహాలో విడుదల కానుండగా, ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఇంటి నుండే చూసే ఛాన్స్ లభించబోతోంది. ఏప్రిల్‌లో నుంచి ఓటీటీలో అందుబాటులో ఉంటుందని సమాచారం.
అల్లరి నరేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో విజయ్ తెరకెక్కిన ఈ చిత్రం నరేష్ నటించిన గత సినిమాలకు భిన్నంగా ఉంది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకుని కలెక్షన్ పరంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా అల్లని నరేష్ మరోసారి తన విలక్షణ నటనను ప్రేక్షకుల ముందు ఉంచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా అద్భుతంగా నటించి అలరించింది. చాలాకాలం నుంచి సరైన్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నరేష్ కు నాంది చిత్రం ఆకలిని తీర్చిందనే చెప్పాలి. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత నాంది రూపంలో తనకు ఇంత మంచి విజయం రావడంతో చాలా ఎమోషనల్ అయి కంట కన్నీరు కూడా పెట్టుకున్నారు నరేష్.