ఆ 20 నిమిషాలు నన్నునేను మర్చిపోయా... కాంతార సినిమాపై పూజా హెగ్డే స్పందన

Published : Oct 25, 2022, 08:16 PM ISTUpdated : Oct 25, 2022, 08:21 PM IST
ఆ 20 నిమిషాలు నన్నునేను మర్చిపోయా... కాంతార సినిమాపై పూజా హెగ్డే స్పందన

సారాంశం

కన్నడ నాట నుంచి వచ్చిన సినిమాలు పాన్ ఇండియాను ఆకట్టుకుంటున్నాయి. అలా వచ్చిన సినిమానే కాంతార. ఈ మూవీపై ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీల్ కూడా మెస్మరైజ్ అవుతున్నారు. కాంతార సినిమాపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు స్టార్స్.. ఈక్రమంలో హీరోయిన్ పూజా హెగ్డే కాంతార సినిమాపై స్పందించారు.   

కేజీఎఫ్‌ తర్వాత కన్నడ నుంచి వచ్చిన సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలోనే కన్నడ నాట నుంచి  రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా కాంతార. ఈమూవీ  కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంది. యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్‌ బ్యాగ్రౌండ్ తో తెరకెక్కిన కాంతార  సినిమాను  కేజీఎఫ్‌ ను నిర్మించిన హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌లో విజయ్‌ కిరగందూర్‌ తెరకెక్కించారు. 

ఈ  సినిమాపై పలువురు సామాన్యులతో పాటు.. స్టార్  సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై హీరోయిన్  పూజా హెగ్దే స్పందించింది.  మూవీపై  ప్రశంసల వర్షం కురిపించింది. తన ఇన్ స్టా లో స్టోరీ రాసుకుంటూ వచ్చిన పూజా హెగ్డే ఈ విధంగా అభిప్రాయం తెలిపింది. మీకు ఏం తెలుసో దాన్నే రాయండి. మీ హృదయానికి చేరువైన, మనసులో నుంచి వచ్చిన కథలనే చెప్పండి. సినిమాలోని ఆఖరి 20 నిమిషాలు స్టన్ అయిపోయాను. పూర్తిగా నన్ను నేను మైమరిచిపోయాను. రిషబ్‌ శెట్టి.. కాంతార నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈమూవీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నాకు గర్వంగా ఉంది అన్నారు. 

అంతే కాదు  నా చిన్నతనంలో చూసిన కోలాలు, భూతాలు, దైవాలను వెండితెర మీద గౌరవప్రదంగా, అందంగా ఆవిష్కరించారు. ఇంత అద్భుతమైన సినిమాను అందించారు.. ఇదే కాదు మీరు మరిన్ని మంచి సినిమాలు తీయాలి. మరింత ఎత్తుకు ఎదగాలి అంటూ తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రాశారు పూజా హెగ్డే. ఇక ఈమూవీపై స్టార్స్ చాలా మంది స్పందిస్తున్నారు. ఇంతకు మందు బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కంగనా రనౌత్ కూడా కాంతార మూవీపై స్పందించారు. సినిమా అంటే ఇది అంటూ ఒక్క మాటలో తేల్చేశారు. 

బాలీవుడ్. టాలీవుడ్, రెలీవుడ్ నుంచి ఈమూవీకి భారీగా రెస్పాన్స్ వస్తోంది. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్‌ రోల్‌ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్‌ 30న  కన్నడలో  రిలీజ్ అయ్యి భారీ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక ఈమూవీ తెలుగు వెర్షన్‌ను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ పై అల్లు అరవింత్ రిలీజ్ చేశారు. సైలెంట్ గా వచ్చిన ఈసినిమా భారీ రెస్పాన్స్ తో ముందు వెళ్తోంది. రోజు రోజుకు సినిమాకు రెస్పాన్స్ పెరుగుతోంది. అంతే కాదు తెలుగులో కన్నడ కంటే ఎక్కువగా కలెక్షన్ల వర్షం కురుస్తోంది.  


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ