పాపం.. పూజా హెగ్డే రెమ్యునరేషన్ లో కోత.. ఆ మూడు శాపంగా మారాయి

Published : Feb 15, 2023, 11:51 AM IST
పాపం.. పూజా హెగ్డే రెమ్యునరేషన్ లో కోత.. ఆ మూడు శాపంగా మారాయి

సారాంశం

అల వైకుంఠపురములో వరకు పూజా హెగ్డేకి తిరుగులేదు అన్నట్లుగా ఆమె హవా సాగింది. ఆమె డస్కీ అందాలకు, పొడుగు కాళ్ళకు యువత వెర్రెత్తి పోతుండడంతో దర్శకనిర్మాతలు ఆమె వెంట పడ్డారు.

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. దీనితో పూజా హెగ్డే సౌత్ లో తిరుగులేని హీరోయిన్ గా మారింది. కానీ  చిత్ర పరిశ్రమలో పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. 

ఒక్క బ్యాడ్ మూవీ లేదా బ్యాడ్ ఇయర్ చాలు.. కెరీర్ తలక్రిందులు అవుతుంది. అల వైకుంఠపురములో వరకు పూజా హెగ్డేకి తిరుగులేదు అన్నట్లుగా ఆమె హవా సాగింది. ఆమె డస్కీ అందాలకు, పొడుగు కాళ్ళకు యువత వెర్రెత్తి పోతుండడంతో దర్శకనిర్మాతలు ఆమె వెంట పడ్డారు. కానీ ఇండస్ట్రీలో విజయం మాత్రమే మాట్లాడుతుంది. సక్సెస్ ఉన్నంతవరకు పూజా హెగ్డే ఎంత అడిగితే అంత రెమ్యునరేషన్ ఇచ్చి ఓకె చేయించుకునేవారు. 

టాలీవుడ్ పూజా హెగ్డే అత్యధికంగా 3 నుంచి 3.5 కోట్ల వరకు పారితోషికం అందుకునేది. గత ఏడాది ఆమె నటించిన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య మూడు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. దీనితో పూజా హెగ్డే క్రేజ్ అమాంతం పడిపోయింది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో SSMB 28 తప్ప మరో తెలుగు మూవీ లేదు. గతంలో తీసుకుంటున్న రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటే నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట. 50 లక్షల నుంచి కోటి వరకు తగ్గించుకోవాలని అడుగుతున్నారట. కొత్త ఆఫర్స్ కావాలంటే రెమ్యునరేషన్ తగ్గించుకోవడం పూజా హెగ్డేకి తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం పూజా హెగ్డే రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు రెడీ అయ్యిందట. మరి ఇకనైనా బుట్టబొమ్మకి కొత్త ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..