300 కోట్ల క్లబ్ లో పొన్నియిన్ సెల్వన్... ఆ ఫీట్ సాధించిన ఐదవ తమిళ చిత్రంగా!

By Sambi ReddyFirst Published Oct 8, 2022, 3:02 PM IST
Highlights


మణిరత్నం విజువల్ వండర్ అంచనాలు అందుకుంది. ఇది కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాస్తుంది. ఈ చిత్రం ఫస్ట్ వీక్ ఘనంగా ముగించింది. 
 

పొన్నియిన్ సెల్వన్ బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తుంది. మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ కోలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. సెప్టెంబర్ 30న పొన్నియిన్ సెల్వన్ ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ విడుదల చేశారు. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా దర్శకుడు మణిరత్నం తెరకెక్కించారు. విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, త్రిష, విక్రం ప్రభు, జయం రవితో పాటు కోలీవుడ్ కి చెందిన భారీ స్టార్ క్యాస్ట్ నటించారు. డీసెంట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ వసూళ్లపరంగా దుమ్మురేపింది. 

ఇతర భాషల్లో ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన పొన్నియిన్ సెల్వన్ తమిళంలో భారీ స్పందన రాబట్టింది. ఇక మొదటి వారానికి పొన్నియిన్ సెల్వన్ రూ. 300 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. దీంతో ఆ ఫీట్ సాధించిన ఐదవ తమిళ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. గతంలో రోబో, కబాలి, 2.0, విక్రమ్ చిత్రాలు మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. 

becomes the 5th Tamil movie to do 300 Crs at the WW Box office, after , , and pic.twitter.com/IbgvSasv4F

— Ramesh Bala (@rameshlaus)

పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగానికి తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. మరి అసలు కథ పార్ట్ 2 లో ఉన్నట్లు తెలుస్తుండగా సీక్వెల్ పై అంచనాలు ఏర్పడ్డాయి. మొత్తంగా తమిళ ఇండస్ట్రీ ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ అంచనాలకు తగ్గకుండా వసూళ్లు సాధిస్తుంది. పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. 

click me!