Swathi Deekshith: నటి స్వాతి దీక్షిత్‌పై పోలీసు కేసు నమోదు, కారణం ఏంటంటే..?

By Mahesh JujjuriFirst Published Nov 22, 2023, 8:16 PM IST
Highlights

టాలీవుడ్ యంగ్ స్టార్.. సోషల్ మీడియా స్టార్ స్వాతి దీక్షిత్ పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. దౌర్జన్యానికి దిగినారన్న ఆరోపణలకు గాను.. ఆమెపూ ఫిర్యాదు రాగా..  నటిపై కేసు నమోదు చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే..? 
 

టాలీవుడ్ యువ సినీ నటి స్వాతి దీక్షిత్‌ పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పాటు మరికొందరిపై కూడా కేసు నమోదు అయ్యింది. ఓ ప్లాట్ విషయంలో ఆమె  దౌర్జన్యానికి దిగిందన్న ఆరోపణలకుగాను  ఆమెపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.  ఇక అసలు విషయానికి వస్తే.. ... జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్‌ 58లో ఉన్న ఓ ప్లాట్‌ నంబర్‌ 1141కు సబంధిచిన  ఓనర్‌ మాధురి. ఆమె ప్రస్తుతం  విదేశాల్లో ఉంటున్నారు. ఆ ఇంటిని ఆమె అమ్మాలి అని నిర్ణయించుకోగా.. ఈ  అమ్మకానికి సంబంధించి స్వాతి దీక్షిత్‌తో పాటు ఆమె స్నేహితులు మధ్యవర్తులుగా వ్యవహరించారు. 

అయితే  ఈ అమ్మకానికి సబంధించిన ఇరు వర్గాల మధ్య కమీషన్లు, పేమెంట్లు.. మొత్తంగా..  డబ్బుల విషయంలో విభేదాలు వచ్చాయి. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం స్వాతితో పాటు వారి స్నేహితులు కారుతో ఆ ఇంటి ముందు గేటును ధ్వంసం చేసి.. స్వాతి దీక్షిత్‌తో పాటు మరో 20 మంది బలవంతంగా ఇంటిలోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ ఫ్యామిలీ సభ్యులు శోభ, ఆమె భర్తను ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని, లేకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. 

Latest Videos

దాంతో ఈ సంఘటనపై ఆ వాచ్ మెన్ కు సబంధిచిన ఫ్యామిలీ మెంబర్స్..  శోభ పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వాతి దీక్షిత్‌ తో పాటు.. ఆమె ఫ్రెండ్స్ అయిన  చింతల సాయి ప్రశాంత్‌, రణవీర్‌ సింగ్‌, రామ్‌కుమార్‌ .. వీరికి సహకరించిన మరి కొందరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

టాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది స్వాతీ దీక్షిత్. కాని హీరోయిన్ గా సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయింది. అందమైనా భామలు` షోతో బుల్లితెరకి పరిచయం అయ్యింది. `తోర్‌ నామ్‌` అనే బెంగాలీ చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత `బ్రేకప్‌` చిత్రంలో నటించింది.వీటితోపాటు `జంప్‌ జిలాని` చిత్రంలో మంచి పాత్ర పోషించింది. మంచి గుర్తింపు కూడా దక్కించుకుంది.

లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌`, `చిత్రాంగద` చిత్రాల్లో నటించి ఫర్వాలేదనిపించుకుంది. వీటితోపాటు `సతుర ఆది 3500`, `సింబా` అనే తమిళ సినిమాల్లోనూ మెరిసింది. బిగ్ బాస్ సీజన్ 4 లో సందడి చేసింది. కాని ఎక్కవ రోజులు హౌస్ లో ఉండలేకపోయింది. వెళ్లడమే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ.. త్వరగానే బయటకు వచ్చేసింది. 


 

click me!