జబర్దస్త్ వినోద్ పై దాడి కేసు.. ఐదుగురిని బుక్ చేసిన పోలీసులు!

Published : Jul 22, 2019, 01:25 PM IST
జబర్దస్త్ వినోద్ పై దాడి కేసు.. ఐదుగురిని బుక్ చేసిన పోలీసులు!

సారాంశం

జబర్దస్త్ ఫేమ్ వినోద్ పై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ఓ ఇంటి విషయంలో ఓనర్లకు, వినోద్ కు మధ్య వివాదం సాగుతోంది. గొడవ పెద్దది కావడంతో ఇంటి ఓనర్ ఒకరు వినోద్ పై దాడికి దిగారు. ఇనుపరాడ్లతో కొట్టడంతో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. 

జబర్దస్త్ ఫేమ్ వినోద్ పై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ఓ ఇంటి విషయంలో ఓనర్లకు, వినోద్ కు మధ్య వివాదం సాగుతోంది. గొడవ పెద్దది కావడంతో ఇంటి ఓనర్ ఒకరు వినోద్ పై దాడికి దిగారు. ఇనుపరాడ్లతో కొట్టడంతో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

తాజాగా ఈ కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. వినోద్ అందించిన వివరాల ప్రకారం మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇంటి ఓనర్స్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వినోద్ పోలీసులకు కోరుతున్నాడు. 

ఆ ఇంటికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వాళ్ళు ఐదుగురు తనపై దాడి చేసి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని వినోద్ ఆరోపిస్తున్నాడు. ఇంటికి సంబందించిన డబ్బు మొత్తం చెల్లించా. ఆ ఏరియా కౌన్సిలర్ కూడా న్యాయం నా వైపే ఉందని చెప్పినట్లు వినోద్ చెబుతున్నాడు.  

PREV
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్