'పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్‌ చూడండి!

Published : Mar 21, 2019, 12:22 PM IST
'పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్‌ చూడండి!

సారాంశం

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'పీఎం నరేంద్రమోదీ'. దర్శకుడు ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సందీప్ ఎస్ సింగ్ నిర్మిస్తున్నారు. 

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'పీఎం నరేంద్రమోదీ'. దర్శకుడు ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సందీప్ ఎస్ సింగ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఇందులో మోదీ బాల్యంతో పాటు రాజకీయ ప్రవేశం, గోద్రా అల్లర్లను చూపించారు. మోదీ ప్రధాని అయిన తరువాత పాకీస్థానీయులు భారత్ పై చేస్తున్న దాడులను చూసి భరించలేక.. 'ఇంకోసారి హిందుస్థాన్ పై చెయ్ వేస్తే.. నరికేస్తా.. ఇదే పాకిస్థాన్ కి నా హెచ్చరిక' అంటూ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది.

ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషలతో కలిపి మొత్తం 23 భాషలలో విడుదల చేస్తున్నారు. ఇందులో భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా పాత్రలో సినీ నటుడు మనోజ్‌ జోషి నటిస్తుండగా.. ద‌ర్శ‌న్ కుమార్‌, బొమ‌న్ ఇరానీ, మ‌నోజ్ జోషీ, ప్ర‌శాంత్ నారాయ‌ణ‌న్‌, జ‌రీనా వాహ‌బ్‌, సేన్‌గుప్తాలు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది