చైతు మొదటి భార్య గురించి సమంత షాకింగ్ కామెంట్స్!

By AN TeluguFirst Published Sep 21, 2019, 1:00 PM IST
Highlights

నాగచైతన్యకి మొదటి భార్య ఉందంటున్నారు సమంత. అంటే ఆయన సమంతను మోసం చేశాడని కాదండోయ్. అసలు అక్కినేని కోడలు ఏం చెప్పాలనుకుంటున్నారంటే..
 

ప్రముఖ నటి మంచు లక్ష్మి 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' అనే షోని హోస్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23 నుంచి షోకి సంబంధించిన అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ షో స్పెషాలిటీ ఏంటంటే.. లక్ష్మితో పాటు ఏ సెలబ్రిటీ అయితే ఈ షోలో పాల్గొంటారో.. వారిని మంచంపై ఇంటర్వ్యూ చేస్తుంది మంచు లక్ష్మీ.

అది కూడా రొటీన్ ఇంటర్వ్యూ టైప్ కాదండీ.. అభిమానులకు సినిమాల గురించి కంటే సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలని చాలా ఇంటరెస్ట్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఆలోచనతోనే ఈ షోని  డిజైన్ చేశారు. ఈ షోలో అక్కినేని కోడలు సమంత కూడా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

అందులో సమంత కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో నాగచైతన్యకి మొదటి భార్య ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ మొదటి భార్య అంటే ఎవరో తెలుసా..? పిల్లో(తలగడ) అంట. చైతూ నిద్రపోయే సమయంలో ఆ పిల్లో పక్కన పెట్టుకొని పడుకుంటారట. 

చైతుని ముద్దు పెట్టుకోవాలన్నా.. మధ్యలో ఆ పిల్లో అడ్డు వస్తుంటుందని చెబుతూ సిగ్గుపడిపోయింది సమంత. పెళ్లికి ముందు సామ్, చైతూ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారట. ఈ మాట మంచు లక్ష్మీ చెప్పగానే.. వెంటనే సామ్.. 'మీరు మా గురించి ఎక్కువ విషయాలు బయటపెట్టేస్తున్నారు' అంటూ కామెంట్ చేసింది. 

 

click me!