అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా స్థాయిలో, ఐదు భాషల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రష్మిక హీరోయిన్. ఈ చిత్రం బడ్జెట్ గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది.
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్-బన్నీ కాంబినేషన్‌లో రానున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో పుష్పపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నిమిత్తం నిర్మాతలు భారిగానే ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ప్రచారం అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాకు 180 కోట్లు ఖర్చుపెడుతున్నారట. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈ స్దాయి బడ్జెట్ పెడుతున్న సినిమా ఇదేనట.
ఇక ఈ సినిమా నిమిత్తం అల్లు అర్జున్ కు 40 కోట్లు ముట్టనున్నాయట. అలాగే సుకుమార్ కు 25 కోట్లు ఇస్తున్నారట. వీళ్లిద్దరికే కలిపి 65 కోట్లు బడ్జెట్ అవుతోంది. అంతేకాకుండా వీళ్లిద్దరికి లాభాల్లో షేర్ ఉంటుందిట. ఇక ఈ సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ సైతం సుకుమార్ భారీగా ఇప్పిస్తున్నారట. ఈ సినిమాకు 150 వర్కింగ్ డేస్. ఇవన్నీ కలిసే 180 కోట్లు దాకా తేలాయట. రీషూట్స్ ఏమన్నా చేస్తే ఇంకా బడ్జెట్ పెరుగుతుందే తప్ప, తగ్గే అవకాసం లేదు.
ఇక ఈ చిత్రానికి సంబంధించి విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని అనుకున్నారు. కానీ, డేట్స్ అందుబాటులో లేకపోవడంతో నటుడు ఆర్యను ఎంపిక చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. 2009లో అల్లు అర్జున్‌తో కలిసి ‘వరుడు’ చిత్రంలో ఆర్య విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి వీరిద్దరూ కలిసి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వివిధ సినిమాలతో బిజీగా ఉన్న ఆర్య పదేళ్ల తర్వాత తెలుగులో ఈ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వనుండటం గమనార్హం.అలాగే ‘పుష్ప’రాజ్‌ను ఢీకొట్టడానికి టాలీవుడ్ కొత్త విలన్‌ను తీసుకుంటారని తెలుస్తోంది. ‘డిస్కోరాజా’, ‘కలర్‌ఫొటో’తో తనలోని విలనిజం చూపించిన సునీల్ ‘పుష్ప’కి విలన్ అవుతాడని అంటున్నారు. అలాగే ‘పుష్ప’లో తొమ్మిది మంది విలన్లు ఉంటారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ... టాలీవుడ్‌లో అయితే హాట్ టాపిక్‌గా మారింది.