'RX 100' హీరోయిన్ లిస్ట్ లో పవన్, మహేష్, ప్రభాస్.. మరి నెక్స్ట్ ఎవరితో..?

Published : Jul 19, 2018, 04:19 PM IST
'RX 100' హీరోయిన్ లిస్ట్ లో పవన్, మహేష్, ప్రభాస్.. మరి నెక్స్ట్ ఎవరితో..?

సారాంశం

ఎవరితో కలిసి నటించాలనుకుంటున్నారనే ప్రశ్నకు సమాధానంగా.. స్టార్ హీరోల లిస్ట్ చెప్పుకొచ్చింది. 'పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి తారలతో నటించాలనుంది ' అని చెప్పింది

గత వారం విడుదలైన 'RX 100' సినిమాతో పాపులారిటీ దక్కించుకుంది నటి పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాతో యూత్ లో అమ్మడుకి మంచి ఫాలోయింగ్ దక్కింది. సినిమా ఇప్పుడు పది కోట్ల షేర్ వసూలు చేసిందంటే అందులో పాయల్ క్రెడిట్ చాలా వరకు ఉంది. అమ్మడు చేసిన అందాల కనువిందుకే సగం టికెట్లు తెగాయి. ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా బోల్డ్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ లో అమ్మడు కనబరిచిన పెర్ఫార్మన్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.

దీనికి తగ్గట్లే ఇప్పుడు పాయల్ కు తెలుగులో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉండడంతో దర్శకనిర్మాతలకు పాయల్ రూపంలో ఓ ఆప్షన్ దొరికింది. మీడియం రేంజ్ హీరోలకు పాయల్ చక్కగా సరిపోతుంది. కానీ అమ్మడు దృష్టి మాత్రం టాప్ రేంజ్ లోనే ఉంది. ఎవరితో కలిసి నటించాలనుకుంటున్నారనే ప్రశ్నకు సమాధానంగా.. స్టార్ హీరోల లిస్ట్ చెప్పుకొచ్చింది.

'పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి తారలతో నటించాలనుంది ' అని చెప్పింది. ప్రస్తుతానికి పవన్ సినిమాలు చేయడం లేదు. ఇక మహేష్ బాబు, ప్రభాస్ లు ఈ బోల్డ్ బ్యూటీకి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Rukmini Vasanth Upcoming Movies: డ్రాగన్‌ బ్యూటీ చేతిలో అదిరిపోయే సినిమాలు.. రుక్మిణి వసంత్‌ మూవీస్‌ లిస్ట్
Ktr Review on Paradise: నాని ప్యారడైజ్‌ మూవీపై కేటీఆర్‌ రివ్యూ.. కానీ అసలు విషయం చెప్పలేదేంటి?