స్టార్ హీరోల సరసన పాయల్ రాజ్ పుత్... మంగళవారంతో అరుదైన రికార్డు!

Published : Feb 27, 2024, 04:21 PM ISTUpdated : Feb 27, 2024, 04:30 PM IST
స్టార్ హీరోల సరసన పాయల్ రాజ్ పుత్... మంగళవారంతో అరుదైన రికార్డు!

సారాంశం

పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ మూవీ మంగళవారం. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. పాయల్ ఏకంగా స్టార్ హీరోల సరసన నిలిచింది.   

'ఆర్ఎక్స్ 100' చిత్ర దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి థియేటర్లలో అన్ని వర్గాల ప్రేక్షకుల తో పాటు విమర్శకుల ప్రశంసలు అందాయి. అయితే కమర్షియల్ గా ఆడలేదు. వరల్డ్ కప్ ఈ చిత్రాన్ని దెబ్బ తీసింది. లేదంటే భారీ వసూళ్లు రాబట్టాల్సింది. రాంగ్ టైం లో విడుదల చేయడం మైనస్ అయ్యింది. అయితే మంగళవారం మూవీ ఇటీవల డిస్నీ హాట్ స్టార్ లో విడుదలవ్వగా దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది.

కాగా 'మంగళవారం' చిత్రానికి బుల్లితెర పై అనూహ్య స్పందన లభించింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా  మంగళవారం ఇటీవల ప్రసారం చేశారు. ఏకంగా  8.3 టి.ఆర్.పి  రాబట్టింది. పెద్ద హీరోల చిత్రాల రేటింగ్స్ కి ధీటుగా నిలిచినా  'మంగళవారం'... ప్రేక్షకులకి ఎంతగా చేరిందో తెలుస్తుంది. ఆ విధంగా పాయల్ మంగళవారం మూవీతో టాప్ హీరోల సరసన చేరింది.

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ బ్రో ఇంత కంటే తక్కువ టీఆర్పీ తెచ్చుకోవడం కొసమెరుపు. బ్రో అర్బన్ ఏరియాలో 7.24, రూరల్ లో 6.29 టీఆర్పీ  రాబట్టింది. ఇక విడుదలైన మూడు మాధ్యమాల్లో మంగళవారం చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మంగళవారం తెరకెక్కింది. 
 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?