బాలకృష్ణతో మాట్లాడుతున్న మంచు విష్ణు.. `కన్నప్ప` లెక్కలు మార్చేస్తున్న మంచు హీరో

Published : Feb 27, 2024, 03:55 PM ISTUpdated : Feb 27, 2024, 09:52 PM IST
బాలకృష్ణతో మాట్లాడుతున్న మంచు విష్ణు..  `కన్నప్ప` లెక్కలు మార్చేస్తున్న మంచు హీరో

సారాంశం

మంచు విష్ణు చేస్తున్న `కన్నప్ప` చిత్రంలో ఇప్పటికే భారీ కాస్టింగ్‌ నటిస్తుంది. తాజాగా మరో సంచలన నేమ్‌ వినిపిస్తుంది. బాలయ్య కూడా కనిపిస్తారని ప్రచారం ఊపందుకుంది.   

మంచు విష్ణు, మంచు మోహన్‌బాబు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న `కన్నప్ప` సినిమా రేంజ్‌ని రోజు రోజుకి మరింతగా పెంచుతున్నారు. ఈ సినిమాలో భారీ కాస్టింగ్‌ యాడ్‌ అవుతున్నారు. పాన్‌ ఇండియా హీరోలను, ఆర్టిస్ట్ లను దించుతున్నారు. వంద కోట్ల సినిమా స్థాయిని కాస్త అమాంతం పెంచేస్తున్నారు. 

ఇప్పటికే ఈ మూవీలో ప్రభాస్‌, కన్నడ స్టార్‌ శివ రాజ్‌ కుమార్‌, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌తోపాటు శరత్‌ కుమార్‌, బ్రహ్మానందం నటిస్తున్నారు. వీరితోపాటు లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. హిందీ నుంచి కంగనా రనౌత్‌ చేస్తుందట. ఈ కాస్టింగ్‌కి ఇప్పుడు మరో బిగ్‌ స్టార్‌ యాడ్‌ కాబోతున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా యాడ్‌ కాబోతున్నారట. 

`కన్నప్ప` సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలకృష్ణని అప్రోచ్‌ అయ్యారట మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి దీనికి బాలయ్య గ్రీన్‌ సిగ్నల్ ఇస్తారా? లేదా అనేది చూడాల్సి ఉంది. కానీ ఇప్పటికే ఈ మూవీ భారీ కాస్టింగ్‌తో పాన్‌ ఇండియాని మించిన మూవీలా మారింది. ఇప్పుడు బాలయ్య పేరు వినిపించడం కూడా మరింత ఆసక్తిని పెంచుతుంది. 

ఈ సినిమాలో కన్నప్పగా మంచు విష్ణు కనిపిస్తారని సమాచారం. శివుడి పాత్రలో ప్రభాస్‌ నటిస్తాడట. ఆయనకు జోడీగా పార్వతి పాత్రని కంగనా రనౌత్‌ నటిస్తారని అంటున్నారు. నయనతార ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. వీరితోపాటు మోహన్‌బాబు కూడా ఓ పాత్రలో మెరిసే అవకాశం ఉంది. ఇలా భారీ కాస్టింగ్‌ ని యాడ్‌ చేస్తూ `కన్నప్ప` రేంజ్‌ని మార్చేస్తున్నారు మంచు విష్ణు. మున్ముందు ఇందులో ఇంకా ఎంత మంది యాడ్‌ అవుతారో చూడాలి. 

పరుచూరి గోపాలకృష్ణ, జీ నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్‌ రెడ్డి, తోట ప్రసాద్‌ స్టోరీ అందించగా, మంచు విష్ణు స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. వందకోట్లతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు ప్రారంభంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ లెక్కలు మారిపోతున్నాయి. ఇక ఈ సినిమాకి హిందీ దర్శకుడు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దసరాకి సినిమా రిలీజ్‌ అనుకున్నట్టు సమాచారం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?