AK రీమేక్‌: పవన్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌

Surya Prakash   | Asianet News
Published : Aug 03, 2021, 09:50 AM IST
AK రీమేక్‌: పవన్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌

సారాంశం

2022 జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. 

మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రాన్ని పవన్ కల్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా  రిలీజ్ డేట్ ఖరారు చేసారు. వచ్చే సంక్రాంతి బరిలో పవన్, రానా చిత్రాన్ని తీసుకురావడానికి చిత్ర టీమ్  రెడీ అవుతోంది. 2022 జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఈ విషయం బయిటకు రాగానే పవన్ ఫ్యాన్స్ సంబరాలు మొదలెట్టేసారు. ప్రభాస్ ..  మహేశ్ బాబు సినిమాల కంటే ముందుగానే పవన్ సినిమా థియేటర్లలో దిగిపోనుందన్న మాట.  

 సితార ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాలో పవన్ భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా చిత్రయూనిట్ రివీల్ చేసింది. దీంతో సోషల్ మీడియా మొత్తం భీమ్లా నాయక్ హవా కొనసాగింది. కాగా ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. త్వరలోనే ఈ సినిమా నుంచి ఓ పాటను రిలీజ్ చేసేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. మ్యూజిక్ సిట్టింగ్స్ లో పవన్ కల్యాణ్, ఈ సినిమాకు మాటలు రాస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులున్న వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.  నిత్యామీనన్ .. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు.   

అలాగే ఈ చిత్రం ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ని జరుపుకుంది. ప్రస్తుతం కూడా కీలకమైన సన్నివేశాల చిత్రీకరణలో ఉంది. 
 ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.మరో ప్రక్క ఈ రీమేక్‌ కోసం పవన్‌ ఓ పాట పాడనున్నారు. ఈ విషయాన్ని గతంలో సంగీత దర్శకుడు తమన్ ఖరారు చేసారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వల్లే ‘వకీల్‌సాబ్‌’, ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ ప్రాజెక్ట్‌లలో నేను భాగమయ్యాను’ అని తమన్‌ చెప్పారు.

ఇక పవన్‌ ఇప్పటికే ఎనిమిదిసార్లు తన పాటలతో సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నారు. ‘తమ్ముడు’లో ‘ఏమ్‌ పిల్ల మాటాడవా’, ‘తాటిచెట్టు ఎక్కలేవు’ పాటలతో మెప్పించిన పవన్‌ ‘ఖుషి’లో ‘బై బయ్యే బంగారు రమణమ్మ’ జానపదగీతంతో అలరించారు. అనంతరం ‘జాని’లో ‘నువ్వు సారా తాగుటమానురన్నో’, ‘రావోయి మా ఇంటికి’, ‘పంజా’లో ‘పాపారాయుడు’, ‘అత్తారింటికి దారేది’లో ‘కాటమరాయుడా’, ‘అజ్ఞాతవాసి’లో ‘కొడకా కొటేశ్వరరావు’ పాటలతో పవన్‌ ఫ్యాన్స్‌ని ఆనందపరిచారు.
 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?