చేతబడి చేయడంతో ఆత్మహత్య ఆలోచనలు, చిరంజీవి ఆ పాత్ర చేయవద్దన్నారు

Published : Aug 03, 2021, 09:41 AM IST
చేతబడి చేయడంతో ఆత్మహత్య ఆలోచనలు, చిరంజీవి ఆ పాత్ర చేయవద్దన్నారు

సారాంశం

మోహిని కొంత కాలం మానసిక సమస్యలతో బాదపడ్డారట. రెండు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. జోతిష్యుడుని కలిస్తే చేతబడి చేశారని చెప్పారట.


చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చిన ఆదిత్య 369 ఫేమ్ మోహిని అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కెరీర్, పర్సనల్ విషయాల గురించి స్పందించడం జరిగింది. హిట్లర్ మూవీలో చిరంజీవికి చెల్లిగా చేశాక ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయట. చిరంజీవి సైతం నువ్వు చెల్లెలిగా చేయవద్దని అన్నారట. ఆ సమయంలో హీరోయిన్ సుహాసిని నేను నీ పక్కన హీరోయిన్ గా, చెల్లిగా కూడా చేశానని చెప్పి.. మోహినిని ఒప్పించారట. 
ఇక పెళ్లి తరువాత తన జీవితంలో అనేక సమస్యలు ఎదురైనట్లు మోహిని తెలిపారు. 


మోహిని కొంత కాలం మానసిక సమస్యలతో బాదపడ్డారట. రెండు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. జోతిష్యుడుని కలిస్తే చేతబడి చేశారని చెప్పారట. ఏసు ప్రభుని నమ్ముకొని మానసిక సమాసమస్యల నుండి బయటపడ్డానని మోహిని తెలిపారు.

 
సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మోహిని కేథలిక్ గా మారారు. ఆమె తన పేరు క్రిస్టియానా గా మార్చుకున్నారు. ఏసు ప్రభుని గట్టిగా నమ్మే మోహిని ఆయనతో నేరుగా మాట్లాడతానని చెప్పడం విశేషం. తన ప్రతి సమస్యను దేవునితో చర్చిస్తానని మోహిని తెలిపారు. అలాగే ఏసు విదేశీ దేవుడు కాదని, ఆయన ప్రస్తావన హిందూ వేదాలలో ఉందని ఆమె చెబుతారు. ఇక మోహిని వెండితెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. 
 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?