పవన్ పవర్... విడుదలకు ముందే వకీల్ సాబ్ రికార్డ్స్

Published : Dec 14, 2020, 07:45 PM IST
పవన్ పవర్... విడుదలకు ముందే వకీల్ సాబ్ రికార్డ్స్

సారాంశం

కమ్ బ్యాక్ తరువాత పవన్ నుండి వస్తున్న మొదటి చిత్రం వకీల్ సాబ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నాను. 2019 మేలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదాపడింది. వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశలో ఉండగా, వచ్చే ఏడాది విడుదల కానుంది. కాగా వకీల్ సాబ్ విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి దాదాపు మూడేళ్లు అవుతుంది. ఆయన చివరి చిత్రం అజ్ఞాతవాసి 2018 జనవరిలో విడుదల కావడం జరిగింది. ఆ తరువాత పాలిటిక్స్ లో బిజీ అయిన పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. గత ఏడాది చివర్లో అనుహ్యంగా వకీల్ సాబ్ మూవీతో పవన్ కమ్ బ్యాక్ ప్రకటించారు. పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ కి ఈ న్యూస్ పిచ్చ కిక్ ఇచ్చింది. వాళ్ళ ఆనందాన్ని మరింత పెంచుతూ పవన్ వరుస ప్రాజెక్ట్స్ ప్రకటించడం జరిగింది. 

కమ్ బ్యాక్ తరువాత పవన్ నుండి వస్తున్న మొదటి చిత్రం వకీల్ సాబ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నాను. 2019 మేలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదాపడింది. వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశలో ఉండగా, వచ్చే ఏడాది విడుదల కానుంది. కాగా వకీల్ సాబ్ విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. 2020 సంవత్సరానికి గానూ అత్యధికంగా ట్వీట్ చేయబడిన టైటిల్ గా వకీల్ సాబ్ నిలిచింది. పవన్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ టైటిల్ ట్రెండ్ చేస్తూ రికార్డు క్రియేట్ చేశారు. ఈ విషయాన్ని పవన్ ఫ్యాన్స్ భారీ ఎత్తున సెలెబ్రేట్ చేసుకున్తున్నారు. 


హిందీ హిట్ మూవీ పింక్ కి తెలుగు రీమేక్ గా దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు మరియు బోనీ కపూర్ చిత్ర నిర్మాతలుగా ఉన్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. నివేదా థామస్, అంజలి కీలక రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. వకీల్ సాబ్ మూవీపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌