
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ మీటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ వైజాగ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలసిన సంగతి తెలిసిందే. పవన్, మోడీ మీటింగ్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచింది.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత తన గురువుని కలిశారు. నటనలో తనకి ఓనమాలు నేర్పిన స్టార్ మేకర్ సత్యానంద్ ని వైజాగ్ లో మీట్ అయ్యారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్, సత్యానంద్ ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కాసేపు మాట్లాడుకున్నారు.
ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ చాలా సంతోషంగా కనిపించారు. పవన్ కళ్యాణ్ వైజాగ్ లో సత్యానంద్ శిక్షణలోనే నటన నేర్చుకున్నారు. సత్యానంద్ చాలా సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. పవన్ ని హీరో చేయాలని చిరంజీవి అనుకున్నప్పుడు ముందుగా శిక్షణ అవసరం అని భావించారు.
అందుకే చిరు పవన్ ని సత్యానంద్ కి అప్పగించి నటనలో శిక్షణ ఇవ్వమని కోరారట. సత్యానంద్ వద్ద నటనలో మెళకువలు నేర్చుకున్న తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పవన్ రాజకీయ కార్యక్రమాల కోసం వైజాగ్ వెళ్లడంతో సత్యానంద్ అక్కడికి వెళ్లారు. పవన్ బస చేస్తున్న హోటల్ లో తన శిష్యుడిని కలుసుకున్నారు.