సైలెంట్‌గా రైజ్‌ అవుతున్న `జెట్టి`.. మాజీ మంత్రి అభినందనలు

By Aithagoni RajuFirst Published Nov 13, 2022, 1:44 PM IST
Highlights

 `రంగస్థలం`, `పుష్ప`, `కాంతార` చిత్రాలే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. అలాంటి కోవలోనే `జెట్టీ` చిత్రం చేరుతుందని చెప్పొచ్చు. కోస్తాంధ్ర జెట్టీల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. 

మొన్నటి వరకు సినిమా కథలు.. ఫిక్షన్‌, లార్జన్‌ దెన్‌ లైఫ్‌ కథ, ఫ్యామిలీ డ్రామాల చుట్టూనే తిరిగేవి. కానీ ఇప్పుడు రియల్‌ ఇన్స్‌డెంట్స్ కి, మట్టిలోని, మన మధ్యలోని సంఘటనల నేపథ్యంలోని, మన కల్చర్‌ని ఆవిష్కరించే కథలతో వచ్చే సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంది. `రంగస్థలం`, `పుష్ప`, `కాంతార` చిత్రాలే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. అలాంటి కోవలోనే `జెట్టీ` చిత్రం చేరుతుందని చెప్పొచ్చు. కోస్తాంధ్ర జెట్టీల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. రెండు వారాల క్రితం ఈ సినిమా విడుదలైంది. 

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ఫ్యామిలీకి చెందిన మాన్యం కృష్ణ హీరోగా పరిచయం అవుతూ నటించిన చిత్రమిది.  ఈ చిత్రానికి సుబ్రమణ్యం పిచుక దర్శకత్వం వహించారు. వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే నిర్మించారు. ఇందులో నందితా శ్వేత (Nanditha Swetha) హీరోయిన్ గా నటించారు. ఇటీవల విడుదలైన(నవంబర్‌ 4) ఈ చిత్రం నెమ్మదిగా పుంజుకుంటోంది. తక్కువ బడ్జెట్‌తో కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌ చిత్రంగా తెరకెక్కించడంతో కోస్తాంధ్ర ప్రజలను ఆకట్టుకుంటుంది. వారి సమస్యలను ఆవిష్కరించే చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని జనాలు ఆదరిస్తున్నారు. 

తాజాగా మాజీ మంత్రి ఈ సినిమాని అభినందించడం విశేషం. ఇటీవల సినిమాని మాజీ మంత్రి, ప్రస్తుత టీటీడీ బోర్డ్ మెంబర్‌ మల్లాడి కృష్ణారావు ఈ సినిమాని యానంలో ప్రత్యేకంగా వీక్షించారు. ఆయన చెబుతూ, ఇలాంటి కథలు తెరమీదకు తీసుకురావడం చాలా కష్టమని, ఈ ప్రయత్నం చేసిన టీమ్‌ని అభినందిస్తున్నా. ఈ కథలో చూపిన సమస్యలు చాలా మందికి బాధ్యతలను గుర్తు చేస్తాయని చెప్పారు. ఈ సినిమా చూసే అవకాశం రావడం ఆనందంగా భావిస్తున్నానని చెప్పారు. 

మాజీ మంత్రితోపాటు హీరో మాన్యం కృష్ణ కూడా థియేటర్లో సందడి చేశారు. ఆయనకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన ఎదురు కావడం విశేషం. ఆయన చెబుతూ, `జెట్టి` సినిమా ని ఆదరిస్తున్న యానం ప్రాంత వాసులకు కృతజ్ఞతలు. తీర ప్రాంతాలలో జెట్టి సినిమా ఆదరణ పెరుగుతుంది. షోస్ కూడా పెరుగుతుండటం చాలా ఆనందం గా ఉంది. తమకు సపోర్ట్ చేసిన మల్లాడి కృష్ణ రావు గారికి కృతజ్ఞతలు. మా ప్రయత్నానికి ప్రేక్షకుల ఆదరణ దక్కుతున్నందుకు ఆనందం గా ఉంది` అని తెలిపారు.

‘జెట్టి’ అంటే.. ఫిషింగ్ హార్బర్.. కోస్తాంధ్రకు జెట్టిలు ఎందుకు అవసరం? సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెనను జెట్టి అంటారు. ఈ జెట్టి అవసరం ఏమిటనే కోణంలో కథ సాగుతుంది. కఠారిపాలెం ప్రాంతంలో ఉన్న జెట్టి ఏరియాలో సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంగా సన్నివేశాలు సాగుతుంటాయి. ఆ ప్రాంతంలోనే ఓ మోతుబరి ఎలా కంట్రోల్ చేస్తుంటాడు. అతడిపై మత్య్సకారులు ఎందుకు ఎదురు తిరిగారు అనే కథతో ఆసక్తికరంగా సినిమా సాగుతుందని టీమ్‌ చెప్పింది.

click me!