పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి సినిమా ఉన్నట్టా లేనట్టా..? మేకర్స్ ఏమంటున్నారు...?

Published : Sep 03, 2022, 02:04 PM IST
పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి సినిమా ఉన్నట్టా లేనట్టా..?  మేకర్స్ ఏమంటున్నారు...?

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఎప్పటి నుంచో అనకుంటున్న సినిమా సంగతి ఏంటీ...? ఈ సినిమా ఉంటుందా లేదా..? పవర్ స్టార్ కు ఈ సినిమా చేసే తీరిక ఉందా..? మేకర్స్ ఏమంటున్నారు..?   

ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అటు రాజకీయంగా కూడా బిజీ అయిపోయాడు.ఈ క్రమంలో ఉన్న సినిమాలకే ఇబ్బందికర పరిస్థితులు రాగా.. సురేందర్ రెడ్డితో అనకున్న సినిమా ఉంటుందా లేదా అని ప్యాన్స్ మధ్య డౌట్ మొదటయ్యింది. ఈ విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. 

 పవన్ కల్యాణ్  ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నారు. ఆ తరువాత తమిల సినిమాగ వినోదయా సితం  రీమేకులో చేయనున్నారు. యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే అంతకు ముందే హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయాల్సి ఉంది పవన్. ఈ సినిమాపై కూడా నీలి నీడలు కమ్ముకుని ఉన్నాయి. 

అయితే వినోయదయా సీతం తరువాతే  హరీశ్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్  సినిమాను పవన్ కటీన్యూ చేయబోతున్నాడటన్న టాక్ గట్టిగానే వినిపిస్తుంది. ఆతరువాతే  సురేందర్ రెడ్డితో ఆయన సినిమా  చేయనున్నట్టుగా ఒక టాక్ వచ్చింది.  కాన ఇప్పటి వరకూ  సురేందర్ రెడ్డి  సినిమాకు సంబంధించి ఎటువంటి కదలికా కనిపించలేదు. దాంతో ఈ సినిమా ఇక ఆగిపోయినట్టు అని అంతా అనుకున్నారు. ఈ ప్రాజెక్టు లేనట్టేనని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారట. 

కానీ తాజాగా నిర్మాత రామ్ తాళ్లూరి మాత్రం ఈసినిమాపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా ఉంటుందని ఆయన  చెప్పారు. ప్రస్తుతం అఖిల్ తో ఏజెంట్ సినిమా చేస్తున్నారు సురేందర్ రెడ్డి. ఈ సినిమా తరువాత ఆయన సినిమా  పవన్ తోనే ఉంటుందని రామ్ అన్నారు.  కాని ఏజెంట్ తరువా పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలి అంటే సురేందర్ రెడ్డి చాలా కాలం ఆగాల్సి ఉంటుంది. హరిహర వీరమల్లుకే చాలా టైమ్ పట్టేట్టు ఉంది. దాని తరువాత రెండు సినిమాలు కంప్లీట్ చేసి.. ఈ ప్రాజెక్ట్ లోకి పవన్ రావాల్సి ఉంటుంది.

 దీనికి చాలా టైమ్ పడుతుందనే భయం ఒక వైపు.. మరో వైపు పవన్ రాజకీయాల్లో కూడా యాక్టీవ్ అయ్యారు. ఈలోపు ఎలక్షన్స్ వస్తే.. అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది.  దాంతో ఈ సినిమా ఉందనే విషయం ఖరారైపోయింది కాని దానికి ఎంత టైమ్ పడుతుందో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?