
పవర్ స్టార్ పవన్ తన ఫ్యాన్స్ కి హోలీ స్పెషల్ ప్రకటించాడు. హోలీ సందర్భంగా ట్రీట్ ఇవ్వబోతున్నారు. `వకీల్‌సాబ్` ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. హోలీ సందర్భంగా ఈ నెల 2న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్ర ప్రమోషన్ స్టార్ట్ చేశారు. మ్యూజికల్ ఫెస్ట్ పేరుతో ఈవెంట్లు నిర్వహిస్తూ సినిమాపై క్రేజ్‌ని పెంచుతున్నారు. అందులో భాగంగా తాజాగా ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో లాయర్ గెటప్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న `వకీల్ సాబ్` పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ కూడా అంచనాలను మరింత పెంచేదిలా ఉంటుందని నమ్ముతున్నారు మేకర్స్.
ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డైలాగ్స్: తిరు, యాక్షన్ రవివర్మ, వి.ఎఫ్.ఎక్స్: యుగంధర్, కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి, సమర్పణ: బోనీ కపూర్, నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్ , దర్శకత్వం: శ్రీరామ్ వేణు.