
అకిరా నందన్ బర్త్ డే (Akira Nandan birthday)నేడు. ఏప్రిల్ 10, 2004లో జన్మించిన అకిరా నందన్ 18వ ఏట అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్-రేణూ దేశాయ్ మొదటి సంతానం అకిరా నందన్. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు చిత్ర ప్రముఖులు అకీరాకు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్, హరీష్ శంకర్ అకిరా నందన్ కు బర్త్ డే విషెస్ తెలియజేశారు.
అయితే అకిరా పుట్టినరోజు సందర్భంగా రేణూ దేశాయ్ షేర్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. సదరు వీడియోలో అకిరా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. చేతికి గ్లౌజులు ధరించి పవర్ ఫుల్ పంచెస్ విసురుతున్నారు. ఈ వీడియో వైరల్ గా తండ్రికి తగ్గ తనయుడు అంటున్నారు. పవన్ (Pawan Kalyan)కెరీర్ బిగినింగ్ నుండి సాహసాలు యుద్ధ విద్యలు పట్ల అత్యంత ఆసక్తి కలిగి ఉన్నారు. ఆయన డెబ్యూ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలో చేసిన సాహసాలు అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి.
ఇక తమ్ముడు మూవీలో ప్రొఫెషనల్ బాక్సర్ రోల్ చేసిన పవన్, జానీ మూవీలో ఫైటర్ గా కనిపించారు. మరి 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న అకీరా అరంగేట్రానికి పెద్దగా సమయం లేదు. ఈ నేపథ్యంలో అతడు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. అలాగే రేణూ వీడియో పోస్ట్ చేయడంతో పాటు అకిరా మంచి కొడుకు, అన్నయ్య, స్నేహితుడు.. గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటూ పొగిడేశారు. కాగా 2012లో పవన్ కళ్యాణ్-రేణూ దేశాయ్ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి పిల్లల బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకున్నారు.