
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజురంజాన్ సందర్భంగా తన ఇంట్లో వేడుకలు చేసుకున్నట్లు ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన తీసుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ముసల్ మాన్ గా పవన్ గెటప్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ రాజకీయాల పరంగా బిజీగా గడుపుతున్నారు. గత కొన్నిరోజులుగా జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆయన రంజాన్ రోజు ఇలా దర్శనమివ్వడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.