పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే?

Published : May 25, 2025, 06:39 PM IST
Pawan Kalyan OG release date

సారాంశం

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హై యాక్షన్ ఎంటర్టైనర్ 'ఓజీ' (OG) సినిమా తాజాగా భారీ అప్‌డేట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆయన నటిస్తున్న 'ఓజీ' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈసి నిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దసరా కానుకగా ఈసినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని మేకర్స్ గట్టినమ్మకంతో ఉన్నారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాజకీయంగా, పరిపాలలో బిజీగా ఉండటంతో పాటు అప్పుడప్పుడు టైమ్ పెట్టుకుని సినిమాలపై దృష్టి పెట్టుతూ, తన లైనప్‌లో ఉన్న ప్రాజెక్టులను ఒకదాని తర్వాత మరోదాన్ని పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా, 'ఓజీ' సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. మేకర్స్ ప్రకటించిన ప్రకారం, ఈ నెల 26న పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు.

'ఓజీ' సినిమా పట్ల ఫ్యాన్స్‌లో ఎక్కువగా ఆసక్తి నెలకొంది. సినిమా నుండి విడుదలైన ప్రీ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియోలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి. కేవలం టాలీవుడ్‌కు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ ఉంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. గతంలో 'పంజా' సినిమాలో కొంత గ్యాంగ్‌స్టర్‌ షేడ్ ఉన్న పాత్ర చేసిన పవన్, ఈసారి మరింత పవర్ఫుల్‌గా కనిపించనున్నాడు. అందులో కూడా మూడు విభిన్న రోల్స్—బ్రూటల్ గ్యాంగ్‌స్టర్, లీడర్, మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం.

'ఓజీ' సినిమాను DVV ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దాన్‌య్య DVV నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై కోసం ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, సినిమాపై పవన్ చూపుతున్న నిబద్ధత చూసి పరిశ్రమలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా, దసరా సీజన్‌లో మరొక బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశం ఉంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్