
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. వరుస షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీ బీజీగా ఉన్నాడు. ఈ మధ్య డిఫరెంట్ గెటప్స్ తో ప్రయోగాలు కూడా చేస్తున్నాడు పవర్ స్టార్(Pawan Kalyan). ఈ క్రమంలోనే పవర్ స్టార్ న్యూ లుక్ ఒకటి వైరల్ అవుతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కొత్తగా.. వింతగా కనిపిస్తే.. ఎవరికి చూడాలని ఉండదు. ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు. సరిగ్గా అలాంటి లుక్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) డిఫరెంట్ గెటప్ లో ఉన్న లుక్ ఒకటి.. సినిమా షూటింగ్ నుంచి లీక్ అయ్యి.. ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.
తెల్ల పంచ, తెల్ల చొక్క..బుజం మీద నల్లటి గొంగళి, చేతిలో ముల్లు కర్ర, ఆముల్లు కర్రకు ఎర్ర తువ్వాలు.. కాలికి కడియం.. కిర్రు చెప్పులు వేసుకుని పవర్ స్టార్(Pawan Kalyan) కొత్త గెటప్ లో సరికొత్తగా కనిపించారు. ఏదో పాట షూటింగ్ కోసం ఈ అవతారం ఎత్తినట్టు సమాచారం. అయితే ఈ గెటలప్ భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాలోది అని తెలుస్తోంది. ఇందులో ఓ పాట కోసం పవన్ ఇలా మారాడట.
పవర్ స్టార్(Pawan Kalyan) ఏది చేసినా ఫ్యాన్స్ కు కొత్తగానే ఉంటంది. ఆయన ప్రతీ గెటప్ ను ఫ్యాస్స్ ఎంజాయ్ చేస్తారు. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాతో అదరగొట్టబోతున్నాడు పవర్ స్టార్(Pawan Kalyan). మలయాళ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్(Pawan Kalyan) తో పాటు రానా స్క్రీన్ ను శేర్ చేసుకున్నారు. ఈనెల 25న భీమ్లా నాయక్ (Bheemla Nayak) మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది.
సాగర్ కే చంద్ర ఈసినమాను డైరెక్ట్ చేయగా.. మాటల మాత్రికుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) ఈ సినిమాకు మాటలతో పాటు స్క్రీన్ ప్లే అందించారు. తమన్(Thaman) మ్యూజిక్ చేసిన ఈ సినిమా పాటలు ఇప్పటికే ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. ముఖ్యంగా భీమ్లా నాయక్(Bheemla Nayak) టైటిల్ సాంగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా (Rana)కు జోడీగా సంయుక్తా మీనన్ నటిస్తోంది.
భీమ్లానాయక్ తో పాటు మరికొన్ని సినిమాలతో పవన్ (Pawan Kalyan) బిజీగా ఉన్నారు. అటు పాలిటిక్స్.. ఇటు సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు పవన్. క్రిష్(Krish) డైరెక్షన్ లో హరిహర వీరమల్లు కంప్లీట్ చేసే పనిలో ఉన్న పవన్.. నెక్ట్స్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు.