'సైరా'లో పవన్ కళ్యాణ్.. సంథింగ్ స్పెషల్.. వైరల్ అవుతున్న ఫోటో!

Published : Aug 14, 2019, 02:35 PM IST
'సైరా'లో పవన్ కళ్యాణ్.. సంథింగ్ స్పెషల్.. వైరల్ అవుతున్న ఫోటో!

సారాంశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ తిరిగి సినిమాల్లోకి రావాలనే డిమాండ్ వినిపించింది. మరికొందరు పవన్ రాజకీయాల్లోనే కొనసాగాలని కోరుకున్నారు. ఇక పవన్ సినిమా ఇదిగో.. అదిగో అంటూ రూమర్లు మాత్రం వెలువడుతున్నాయి. తాజాగా సైరా చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ మెగా అభిమానులని ఊపేస్తోంది. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రానికి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించబోతున్నారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తూ పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దరూ కలసి డబ్బింగ్ స్టూడియోలో కనిపించారు. దీనిపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. త్వరలో విడుదల కాబోతున్న సైరా టీజర్ కు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించారని కొందరు అంటుంటే.. సినిమా మొత్తానికి పవన్ వాయిస్ ఓవర్ ఉంటుందని మరికొందరు అంటున్నారు. 

తాజాగా పవన్ కళ్యాణ్, చిరంజీవి కలసి ఉన్న ఫోటో చూస్తుంటే మాత్రం సంథింగ్ స్పెషల్ ఉందని మాత్రం అర్థం అవుతోంది. తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాణంలో తెరక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న సైరా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. నయనతార హీరోయిన్. 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌