చాలాకాలం తర్వాత తిరిగి మేకప్ వేసుకున్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సినిమాల వేగం పెంచారు. ఆయన నటిస్తున్న ‘వకీల్‌సాబ్’ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా.. ఏమాత్రం సమయం వృథా చేయకుండా వెంటనే తర్వాతి సినిమాకు పనిచేసేందుకు సిద్ధమయ్యారాయన. #PSPK27 అనే వర్కింగ్ టైటిల్‌తో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్ర యూనిట్‌తో వపన్ కలవనున్నారు.
వరసపెట్టి ప్రాజెక్టులు పట్టాలు ఎక్కిస్తున్నారు పవన్ కళ్యాణ్ . ఇప్పటికే వకీల్ సాబ్ షూట్ పూర్తి చేసుకున్న ఆయన క్రిష్ దర్శకత్వంలో రూపొందే పీరియడ్ ఫిల్మ్ కు రెడీ అవుతున్నారు. అలాగే అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ సెట్స్ లో త్వరలో జాయిన్ కానున్నారు. ఈ సినిమా సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయనున్నారు. వచ్చే వారం నుంచి షూట్ ప్రారంభం కానుంది. షూటింగ్ లో ఎక్కువ భాగం పొల్లాచిలో చేయనున్నారు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో సినిమా ఉంది.
ఇవన్నీ కాక ఇప్పుడు ఆయన సురేంద్ర రెడ్డి సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ని సురేంద్రరెడ్డి...పవన్ కళ్యాణ్ కు నేరేట్ చేసినట్లు సమాచారం. పవర్ స్టార్ 29 న సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తుంది. ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా వక్కంతం వంశీ కథను అందిస్తున్నాడు. ఈ విషయాన్నిఇప్పటికే అధికారికంగా ప్రకటించింది చిత్ర టీమ్.
‘లీడ్ ఐటీ’అనే సంస్థ వ్యవస్థాపకుడు అయిన రామ్.. రవితేజ నటించి ‘నేల టిక్కెట్టు’, ‘డిస్కో రాజా’ వంటి సినిమాలు నిర్మించారాయన. జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కల్యాన్‌కు రామ్ మంచి మిత్రుడు. 650 మందికి పైగా పని చేస్తున్న అతని కంపెనీ ‘లీడ్ ఐటీ’.. ఎన్నో స్టార్టప్, ఫార్చ్యూన్ కంపెనీలకు ప్రోత్సాహాన్ని అందించింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన రామ్ తాళ్లూరి.. ప్రభుత్వ ఉద్యోగిగా.. జీవితాన్ని ప్రారంభించారు. ఆయన అతి పెద్ద ట్రామ్‌పొలైన్ పార్క్ స్కై జోన్ ఫ్రాంచైజీకి యజమాని. ఆయన కృషి, పట్టుదలే ఇవ్వని సాధ్యమయ్యేలా చేశాయి.