నితిన్ బర్త్ డే గిఫ్ట్ అంధాదున్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ డేట్ ఫిక్స్డ్!

Published : Mar 29, 2021, 05:26 PM ISTUpdated : Mar 29, 2021, 05:28 PM IST
నితిన్ బర్త్ డే గిఫ్ట్ అంధాదున్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ డేట్ ఫిక్స్డ్!

సారాంశం

నితిన్ బర్త్ డే పురస్కరించుకొని నితిన్ నెక్స్ట్ మూవీ టైటిల్ విడుదల చేస్తున్నారు. హిందీ హిట్ మూవీ అంధాదున్ తెలుగు రీమేక్ లో నితిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  


హీరో నితిన్ మరో సర్ప్రైజింగ్ అప్డేట్ తో ఫ్యాన్స్ ముందుకు వచ్చేస్తున్నారు. రేపు ఆయన 30వ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నితిన్ బర్త్ డే పురస్కరించుకొని నితిన్ నెక్స్ట్ మూవీ టైటిల్ విడుదల చేస్తున్నారు. హిందీ హిట్ మూవీ అంధాదున్ తెలుగు రీమేక్ లో నితిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 
నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కీలక రోల్ చేస్తున్నారు. తమన్నా మొదటిసారి బోల్డ్ మరియు నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర చేయడం విశేషం. ఈ మూవీపై నితిన్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. హిందీ చిత్రంలో నటించిన ఆయుష్మాన్ ఖురానా ఈ చిత్రంతో జాతీయ అవార్డు గెలుపొందడం విశేషం. నితిన్ సైతం గుడ్డివాడిగా ఈ చిత్రంతో ప్రయోగం చేయనున్నాడు. 


ఇక భీష్మ మూవీతో సూపర్ హిట్ కొట్టిన నితిన్ చెక్ మూవీ రూపంలో పరాజయం అందుకున్నారు. రోజుల వ్యవధిలో నితిన్, రంగ్ దే మూవీ విడుదల చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రంగ్ దే ఫలితం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?